close
Choose your channels

ఏప్రిల్ లో రానున్న సుమంత్ కొత్త చిత్రం

Friday, January 12, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

గ‌తేడాది విడుద‌లైన మళ్ళీ రావా` సినిమాతో చాలా రోజుల తర్వాత విజయాన్ని చవి చూశాడు క‌థానాయ‌కుడు సుమంత్. కార్తిక్ పాత్ర‌లో ప‌రిణతి చెందిన త‌న న‌ట‌న‌తో మెప్పించిన ఈ టాలెంటెడ్ హీరో .. ఆ సినిమా విజయం ఇచ్చిన ఉత్సాహంతో తన తదుపరి చిత్రం షూటింగ్‌తో ఫుల్ బిజీగా మారిపోయాడు. ఇప్ప‌టికే సగం చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకున్న సుమంత్ త‌దుప‌రి చిత్రం..

ప్ర‌స్తుతం విశాఖపట్నంలో చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటోంది. నిర‌వ‌ధికంగా సాగే ఈ వైజాగ్ షెడ్యూల్‌తో ఈ సినిమా షూటింగ్ పూర్త‌వుతుంద‌ని చిత్ర వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. ఈ సినిమాలో నైట్ షిఫ్ట్ ఉద్యోగం చేసే ఫొటో జ‌ర్న‌లిస్ట్‌గా ఓ డిఫ‌రెంట్‌ పాత్రను పోషిస్తున్నారు సుమంత్. కాగా, ఈ సినిమాని వేస‌వి కానుక‌గా ఏప్రిల్ నెలలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు. క్రైమ్ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం ద్వారా అనిల్ కుమార్ దర్శకుడిగా పరిచయమ‌వుతున్నాడు. ఈ చిత్రంతో సుమంత్ మ‌రో విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకుంటాడేమో చూడాలి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.