close
Choose your channels

శ్రీ శ్రీ గురించి సూపర్ స్టార్ కామెంట్..

Thursday, December 10, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సూప‌ర్ స్టార్ క్రిష్ణ‌, విజ‌య‌నిర్మ‌ల‌, న‌రేష్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో ముప్ప‌ల‌నేని శివ తెర‌కెక్కిస్తున్న చిత్రం శ్రీ శ్రీ. ఎస్.బి.ఎస్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ పై శ్రీ సాయిదీప్, బాలు రెడ్డి, షేక్ సిరాజ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం శ్రీ శ్రీ రామానాయుడు స్టూడియోలో షూటింగ్ జ‌రుపుకుంటుంది.

ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన మీడియా మీట్ లో సూప‌ర్ స్టార్ క్రిష్ణ మాట్లాడుతూ...శ్రీ శ్రీ అనే టైటిల్ వింటుంటే మ‌హా క‌వి శ్రీశ్రీ గుర్తుకువ‌స్తున్నారు.ఆ మ‌హా క‌వి ఆవేశాన్ని రాత‌ల్లో చూపిస్తే...మా శ్రీ శ్రీ త‌న ఆవేశాన్ని చేత‌ల్లో చూపిస్తాడు. ఈ సినిమాలో న‌టిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ముప్ప‌ల‌నేని శివ క‌థ చెప్పిన దానిక‌న్నా ఇంకా బాగా తీస్తున్నారు.ఇప్ప‌టికే 75% షూటింగ్ పూర్త‌య్యింది. మిగిలిన షూటింగ్ కూడా త్వ‌ర‌గా పూర్తి చేసి ఫిబ్ర‌వ‌రిలో రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం అన్నారు. చాలా గ్యాప్ త‌రువాత ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్న సూప‌ర్ స్టార్ శ్రీ శ్రీ తో స‌క్సెస్ సాధిస్తాడ‌ని ఆశిద్దాం.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.