close
Choose your channels

Mahesh Babu:కండలు తిరిగి, నరాలు కనిపించేలా... మహేశ్ బాడీని చూశారా, ఫోటోలు వైరల్

Thursday, March 2, 2023 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సూపర్‌స్టార్ కృష్ణ గారి నటవారసుడిగా తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చి.. తన మార్క్ యాక్టింగ్‌తో సూపర్‌స్టార్‌గా ఎదిగారు మహేశ్‌బాబు. హిట్లొచ్చినా.. ఫ్లాప్స్ ఎదురైనా చెక్కు చెదరని క్రేజ్ ప్రిన్స్ సొంతం. మహేశ్ అంటే ముందుగా గుర్తొచ్చేది ఆయన అందం. ఆరడుగుల ఎత్తు, పాలనురగ లాంటి స్కిన్‌టోన్‌తో తళతళ మెరిసిపోతారు ప్రిన్స్. అందుకే ఆయన అమ్మాయిల కలల రాకుమారుడు. సీనియర్ హీరోయిన్లైనా.. ఇప్పుడిప్పుడే వస్తున్న ముద్దుగుమ్మలైనా మీరు ఏ హీరోతో నటించాలి అనుకుంటున్నారు అని అడిగితే.. టక్కున వచ్చే సమాధానం మహేశ్‌బాబే. టాలీవుడ్‌లోనే కాదు.. బాలీవుడ్‌లో కూడా మహేశ్‌ను మించిన అందగాడు లేడంటూ చెబుతారు. తోటి హీరోలు కూడా ఆయన అందాన్ని పొగుడుతూ.. కొంతమంది లోలోపల కుళ్లుకుంటూ ఉంటారన్నది వాస్తవం.

జిమ్‌లో కష్టపడుతోన్న మహేశ్ బాబు:

అయితే ప్రస్తుతం సిక్స్ ప్యాక్ బాడీ అన్నది ఫ్యాషన్ కావడంతో హీరోలంతా జిమ్‌లలో కసరత్తు చేస్తున్నారు. కండలు తిరిగిన దేహం కోసం విపరీతంగా డైట్లు చేస్తున్నారు. మహేశ్‌ కూడా అప్పట్లో ఓసారి సిక్స్ ప్యాక్ కోసం చేశారని టాక్. ఈ సంగతి పక్కనబెడితే.. ప్రస్తుతం మహేశ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. SSMB28 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ మూవీ కోసం మహేశ్ బాబు జిమ్‌లో కష్టపడుతున్నాడు. హెవీ వర్కవుట్స్ చేస్తూ... బాడీని బిల్డ్ చేస్తున్నారు.

ఫ్యాన్స్‌ని సర్‌ప్రైజ్ చేసిన సూపర్‌స్టార్:

ప్రస్తుతం తన కసరత్తులకు సంబంధించిన ఓ ఫోటోను సూపర్‌స్టార్ షేర్ చేశారు. దీనికి ఆర్మ్ డే అంటూ ఆయన క్యాప్షన్ ఇచ్చారు. కండలు తిరిగి, నరాలు కనిపిస్తున్న తన దేహాన్ని చూపుతున్న సూపర్‌స్టార్ మహేశ్ బాబు ఫోటోలు వైరల్ అవుతున్నాయి. త్రివిక్రమ్‌తో సినిమా తర్వాత దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మహేశ్ ఓ సినిమా చేయనున్నారు. ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే కసరత్తు మొదలెట్టారు జక్కన్న. ఆర్ఆర్ఆర్ తర్వాత ఆయన టేకప్ చేయబోయే ప్రాజెక్ట్ కావడంతో భారతీయ చిత్ర పరిశ్రమ ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.