close
Choose your channels

నాగారంలో అభిమానుల నడుమ సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు వేడుకలు...

Wednesday, June 1, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
తేనెమ‌న‌సులు చిత్రంతో హీరోగా తెలుగు చిత్ర‌సీమ‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఘ‌ట్ట‌మ‌నేని శివ‌రామ‌కృష్ణ నేడు సూప‌ర్‌స్టార్ కృష్ణగా అభిమానుల‌ను అల‌రించ‌డానికి శ్రీ శ్రీ చిత్రంతో మ‌రోసారి ప్రేక్ష‌కులు, అభిమానుల ముందుకు రానున్నారు. న‌టుడిగా 50 వ‌సంతాల‌ను పూర్తి చేసుకున్న ఆయ‌న త‌న 74వ పుట్టిన‌రోజు వేడుక‌ల‌ను అభిమానుల స‌మ‌క్షంలో ఘ‌నంగా జ‌రుపుకున్నారు. మంగ‌ళవారం హైద‌రాబాద్ నాగారంలోని ప‌ద్మాల‌యా స్టూడియోలో జ‌రిగిన పుట్టిన‌రోజు వేడుక‌ల్లో ఆయ‌న పాల్గొన్నారు. కేక్ క‌టింగ్ అనంత‌రం ...
సూప‌ర్‌స్టార్ కృష్ణ మాట్లాడుతూ ``గ‌త రెండేళ్లుగా నా పుట్టిన‌రోజు వేడుక‌ల‌ను హైద‌రాబాద్‌లోనే జ‌రుపుకుంటున్నాను. తేనె మ‌న‌సులు చిత్రంతో ఇండ‌స్ట్రీలోకి హీరోగా ప‌రిచ‌యం అయిన నేను గూఢ‌చారి 116, అల్లూరి సీతామ‌రాజు, సింహాస‌నం, ఈనాడు, తెలుగు వీర లేవ‌రా ఇలా ఎన్నో చిత్రాల్లో న‌టించాను.ఎన్నో ఎక్స్‌పెరిమెంట్స్ చేశాను. ప్ర‌తి ఎక్స్‌పెరిమెంట్‌లో తెలుగు ప్రేక్ష‌కులు, నా అభిమానులు అండ‌గా నిల‌బ‌డ్డారు. వారి ఆశీస్సుల‌తోనే నేను న‌టుడిగా 50 సంవ‌త్స‌రాల‌ను పూర్తి చేసుకున్నాను. ఈ ఏడాది నేను న‌టించిన శ్రీశ్రీ చిత్రం జూన్ 3న రిలీజ్ అవుతుంది. విదేశాల్లో అదే రోజున సినిమా ఆన్‌లైన్లో విడుద‌ల‌వుతున్న తొలి చిత్రం కూడా ఇదే. ఈ చిత్రాన్ని నా అభిమానుల‌కు నా పుట్టిన‌రోజు కానుక‌గా భావిస్తున్నాను. థియేట‌ర్‌తో పాటు, తొలిసారి ఆన్‌లైన్ లో విడుద‌ల‌వుతున్న చిత్ర‌మిదే కావ‌డం విశేషం. ఇన్ని సంవ‌త్స‌రాలు న‌న్ను, నా కుటుంబాన్ని ఆద‌రిస్తున్నందుకు ధ‌న్య‌వాదాలు. `` అన్నారు.
శ్రీమ‌తి విజ‌య‌నిర్మల మాట్లాడుతూ ``కృష్ణ‌గారు అభిమానుల మ‌ధ్య‌న ఆయ‌న పుట్టిన‌రోజు వేడుక‌ల‌ను జ‌రుపుకోవ‌డం ఎంతో ఆనందంగా ఉంది. ఈ ఏడాది ఆయ‌న పుట్టినరోజు కానుక‌గా శ్రీ శ్రీ చిత్రాన్ని అందిస్తున్నాం. ముప్ప‌ల‌నేని శివ‌గారు సినిమాను ఎంతో చక్క‌గా తీశారు. నిర్మాత‌లు సినిమాను ఎంతో క్వాలిటీతో ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా నిర్మించారు`` అన్నారు.
ముప్ప‌ల‌నేని శివ మాట్లాడుతూ ``కృష్ణ‌గారి పండంటి కాపురం చూసి ఆయ‌న‌కు అభిమానిన‌య్యాను. ఆయ‌న న‌టించిన చిత్రాల‌కు కో డైరెక్ట‌ర్‌గా వ‌ర్క్ చేశాను. ఆయ‌న ద్వారానే ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయ్యాను. ఆయ‌న ఆశీస్సుల‌తో 20 సినిమాల‌కు ద‌ర్శ‌కత్వం వ‌హించాను. ఇప్పుడు 50 ఏళ్ల ఆయ‌న న‌ట ప్ర‌స్థానం త‌ర్వాత న‌టించిన శ్రీశ్రీ చిత్రాన్ని నేను డైరెక్ట్ చేయ‌డం ఆనందంగా ఉంది. సినిమా అంద‌రికీ న‌చ్చేలా ఉంటుంది`` అన్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.