close
Choose your channels

దీపావళి కానుకగా 2,500 మంది పిల్లలకు గిఫ్ట్ బాక్స్ లు పంపిన సూపర్ స్టార్ మహేష్..!

Tuesday, November 1, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సూపర్‌స్టార్‌ మహేష్‌, రకుల్‌ ప్రీత్ సింగ్ జంట‌గా ఎన్‌.వి.ఆర్‌. సినిమా పతాకంపై టాప్‌ డైరెక్టర్‌ ఎ.ఆర్‌.మురుగదాస్‌ దర్శకత్వంలో ఓ భారీ చిత్రం రూపొందుతుంది. ఈ చిత్రాన్ని ఎన్‌.వి.ప్రసాద్‌, ఠాగూర్‌ మధు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్‌ హైదరాబాద్‌లో జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్‌లో భాష్యం స్కూల్‌కి చెందిన 2,500 మంది విద్యార్థులు పాల్గొన్నారు. చిన్న పిల్లలంటే అమితంగా ఇష్టపడే సూపర్‌స్టార్‌ మహేష్‌ ఎంతో ఎంజాయ్‌ చేస్తూ వారితో కలిసి షూటింగ్‌లో పాల్గొన్నారు.
షూటింగ్‌లో పాల్గొన్న 2,500 మంది పిల్లలకు సూపర్‌స్టార్‌ మహేష్‌ చాక్లెట్స్‌, సాఫ్ట్‌ డ్రింక్స్‌తో కూడిన బాక్స్‌లను దీపావళి రోజున పంపించారు. పిల్లలందరూ మహేష్‌తో దిగిన ఫోటోను ఆ బాక్స్‌పై ప్రింట్‌ చేశారు. అలాగే షూటింగ్‌లో పాల్గొన్న పిల్లలందరికీ థాంక్స్‌ చెప్తూ మహేష్‌ స్వయంగా సంతకం చేసిన థాంక్స్‌ కార్డ్‌ కూడా బాక్స్‌ ఓపెన్‌ చేయగానే కనిపించడంతో పిల్లలందరూ చాలా థ్రిల్‌ అయ్యారు. సూపర్‌స్టార్‌ మహేష్‌తో కలిసి నటించడం మర్చిపోలేని అనుభూతినిచ్చిందని, ఆయన తమకు దీపావళి గిఫ్ట్‌లు ఇవ్వడం మరింత ఆనందాన్ని కలిగించిందని పిల్లలు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.