close
Choose your channels

సీఏఏపై రజనీ హాట్ హాట్ వ్యాఖ్యలు..!

Wednesday, February 5, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సీఏఏపై రజనీ హాట్ హాట్ వ్యాఖ్యలు..!

యావత్ భారతదేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సీఏఏ వ్యవహారంపై ఆందోళనలు, నిరసనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రకటన వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకూ ఆందోళనలు మాత్రం అస్సలు తగ్గట్లేదు. అయితే ఇప్పటికే ఈ వ్యవహారంపై పలువురు ప్రముఖులు తమ అభిప్రాయాలను మీడియా, సోషల్ మీడియా ముఖంగా పంచుకున్నారు. తాజాగా ఈ సీఏఏపై తమిళ్ సూపర్‌స్టార్ రజనీకాంత్ స్పందించారు.

నేనే వ్యతిరేకిస్తా!

‘సీఏఏ ముస్లింలకు వ్యతిరేకం కాదు. నిరసనల్లో పాల్గొనే ముందు విద్యార్థులు తల్లిదండ్రులను సంప్రదించాలి. కొన్ని పార్టీలు సీఏఏపై రాద్దాంతం చేస్తున్నాయి. ముస్లింలకు వ్యతిరేకంగా ఏవైనా చట్టాలు వస్తే నేనే వ్యతిరేకిస్తాను. జనాభా లెక్కల ప్రక్రియ వెంటనే ప్రారంభించాలి’ అని రజనీకాంత్‌
తెలిపారు. మరి దేశ వ్యాప్తంగా ఆందోళన చేస్తుండగా రజనీ కీలక వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ అయ్యింది. ఈ వ్యాఖ్యలపై ఆయన వీరాభిమానులు ఎలా రియాక్ట్ అవుతారో మరి.

నోటీసులిస్తే స్పందిస్తా!

తమిళనాడులో సంచలనం సృష్టించిన స్టెరిలైట్‌ కర్మాగారానికి వ్యతిరేకంగా తూత్తుకుడిలో చేపట్టిన ప్రజా ఆందోళన వ్యవహారంలో విచారణకు హాజరుకావాలని రజనీకి నోటీసులు అందాయని గత 24 గంటలుగా మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన విషయం విదితమే. నేరుగా ఆయన విచారణకు హాజరు కావాలని విచారణ కమిటీ సమన్లు జారీచేసిందని వార్తలు వచ్చాయి. ఈ నోటీసులపై రజనీ మాట్లాడుతూ.. తూత్తుకూడి ఘటనపై తనకు ఎలాంటి నోటీసులు రాలేదని స్పష్టం చేశారు. ఒకవేళ నోటీసులు వస్తే మాత్రం వెంటనే తాను స్పందిస్తానని.. తాను వివరణ ఇచ్చుకుంటానని రజనీకాంత్ తెలిపారు. అయితే.. పోలీసులపై దాడి చేసింది సంఘ విద్రోహులని.. పోరాటంలో పాల్గొన్నది ప్రజలు కాదన్నారు. ఆ సంఘ విద్రోహులు ఎవరో తనకు తెలుసన్నారు. ఆ విషయాలన్నీ చెప్పాల్సిన టైమ్‌లో.. చెప్పాల్సిన చోట చెబుతానని రజనీ తెలిపారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.