close
Choose your channels

శిరీష్ తో సురభి

Tuesday, August 15, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు సినిమాతో హీరోగా మంచి విజ‌యాన్నే అందుకున్నాడు హీరో అల్లు శిరీష్‌. ఇప్పుడు హ‌ర్ర‌ర్ థ్రిల్ల‌ర్ `ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా` ద‌ర్శ‌కుడు విఐ.ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. సైంటిఫిక్ థ్రిల్ల‌ర్‌గా సినిమా రూపొందుతోంది. ఈ చిత్రంలో అల్లు శిరీష్‌తో శీర‌త్‌క‌పూర్ న‌టిస్తుంది.

ఈ సినిమాలో మ‌రో హీరోయిన్‌గా సుర‌భి కూడా న‌టిస్తుంద‌ట‌. జెంటిల్‌మేన్‌, ఎటాక్, ఎక్స్‌ప్రెస్‌రాజా చిత్రాల్లో సురభి న‌టించింది. ఎందుక‌నో సుర‌భికి మంచి బ్రేక్ మాత్రం రావ‌డం లేదు. ఇప్పుడు అల్లు శిరీష్‌, విఐ ఆనంద్ సినిమాలో సుర‌భి టీవీ ఆర్టిస్టుగా క‌నిపించ‌బోతుంద‌ట‌. ఈ సినిమాతోనైనా తెలుగులో త‌న‌కు మంచి బ్రేక్ దొరుకుతుంద‌ని సుర‌భి ఆశ‌గా ఉంది. ప్ర‌స్తుతం నిర్మాణ ద‌శ‌లోని ఈ సినిమాకు ఏ నిమిషము ఏమీ జ‌రుగునో అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉంద‌ట‌.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.