close
Choose your channels

రకుల్ లాగే తమన్నాకి కూడా కలిసొస్తుందా?

Monday, April 30, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

రకుల్ లాగే తమన్నాకి కూడా కలిసొస్తుందా?

మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'సైరా నరసింహారెడ్డి'. నయనతార, అమితాబ్ బచ్చన్, జగపతి బాబు, విజయ్ సేతుపతి ఇత‌ర ముఖ్య తారాగణంగా  రూపొందుతున్న ఈ సినిమాకి మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం తమన్నాను ఎంపిక చేసిన విషయం తెలిసిందే.

గతంలో సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన 'ఊసరవెల్లి' మూవీలో తమన్నా హీరోయిన్‌గా నటించింది. ఆ మూవీ ఆశించినంత విజయం సాధించలేదు. మరి ఇప్పుడు రెండోసారి వీళ్ళ కాంబినేషన్‌లో వస్తున్న ‘సైరా’తోనైనా ఈ కాంబో విజయం సాధిస్తారేమో చూడాలి.

ఇంత‌కుముందు ఇటువంటి పరిస్థితే రకుల్ ప్రీత్ సింగ్‌కు కూడా ఎదురైంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘కిక్2’లో నాయిక‌గా నటించిన రకుల్‌కు.. ఆ సినిమా అంతగా కలిసి రాలేదు. కాని ఆ తర్వాత వచ్చిన 'ధృవ'తో ఈ కాంబినేషన్ విజయాన్ని అందుకుంది.

ఈ నేప‌థ్యంలో.. ఇప్పుడు తమన్నా విషయంలో కూడా అటువంటి మ్యాజిక్ రిపీట్ అవుతుందేమో చూడాలి. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమిటంటే.. ర‌కుల్‌, సురేంద‌ర్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన రెండో చిత్రంలో చ‌ర‌ణ్ హీరోగా న‌టిస్తే.. త‌మ‌న్నా, సురేంద‌ర్ కాంబోలో వ‌స్తున్న రెండో చిత్రంలో చిరంజీవి హీరో కావ‌డం.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.