close
Choose your channels

స్పెష‌ల్ సాంగ్స్ చేయ‌డానికి ఇబ్బందేమీ లేదు:  త‌మ‌న్నా

Tuesday, June 9, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

స్పెష‌ల్ సాంగ్స్ చేయ‌డానికి ఇబ్బందేమీ లేదు:  త‌మ‌న్నా

మిల్కీబ్యూటీ త‌మ‌న్నా లాక్‌డౌన్ స‌మ‌యంలో ఇంటికే ప‌రిమిత‌మైంది. ఫిట్‌నెస్ పెంచుకోవ‌డంతో పాటు సింధి భాష నేర్చుకోవ‌డంపై ఫోకస్ పెట్టాన‌ని ఇటీవ‌ల చెప్పిన త‌మ‌న్నా రీసెంట్ ఇంట‌ర్వ్యూలో త‌ను చేసిన స్సెష‌ల్ సాంగ్స్ గురించి స్పందించారు. ‘‘నేను మ్యూజిక్‌, డాన్స్‌ను బాగా ఇష్ట‌ప‌డ‌తాను. న‌న్ను ఫాలో అయ్యేవారికి తెలుసు. నేనెంత‌గా డాన్స్‌ను ఇష్ట‌ప‌డ‌తానో. కాబ‌ట్టి ఏమాత్రం అవ‌కాశం వ‌చ్చిన నా డాన్సింగ్ స్కిల్‌ను మెరుగు ప‌రుచుకోవ‌డానికి నా స్నేహితులు(ఇత‌ర హీరోలు)తో క‌లిసి ప్ర‌య‌త్నిస్తుంటాను. నేను స్పెష‌ల్ సాంగ్స్ చేయ‌డానికి కార‌ణం ప‌లానా అని ఎవ‌రైనా చెబితే న‌మ్మ‌కండి’’ అన్నారు త‌మ‌న్నా.

స్పెష‌ల్ సాంగ్స్ చేయ‌డానికి ఇబ్బందేమీ లేదు:  త‌మ‌న్నా

ఆ రెండు పాత్ర‌లు చేయ‌డానికి క‌ష్ట‌ప‌డ్డా...

త‌మ‌న్నా త‌న కెరీర్‌లో రెండు పాత్ర‌ల‌ను పోషించ‌డానికి బాగా క‌ష్ట‌ప‌డ్డాన‌ని ఈ ఇంట‌ర్వ్యూలో తెలిపారు. అందులో ఒక‌టి బాహుబ‌లి. ఇందులో అవంతిక‌గా న‌టించిన తాను యాక్ష‌న్ పార్ట్ కోసం బాగా క‌ష్ట‌ప‌డ్డాన‌ని తెలిపారు. అలాగే ఇక అభినేత్రి సినిమా కోసం కూడా ఎక్కువ క‌ష్ట‌ప‌డ్డాన‌ని తెలిపారు. అభినేత్రి సినిమాను అటు త‌మిళం, హిందీలోనూ తెర‌కెక్కించారు. ఎ.ఎల్.విజ‌య్‌గారు, ప్ర‌భుదేవాగారితో క‌లిసి న‌టించ‌డాన్ని ఎంజాయ్ చేశానని త‌మ‌న్నా అన్నారు. ప్ర‌స్తుతం త‌మ‌న్నా తెలుగులో గోపీచంద్ హీరోగా సంప‌త్ నంది ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న సీటీమార్ చిత్రంలో జ్వాల అనే క‌బ‌డ్డీ కోచ్ పాత్ర‌లో న‌టిస్తుంది. ఈ రోల్ కోసం త‌మ‌న్నా తెలంగాణ యాస‌ను నేర్చుకోవ‌డం విశేషం.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.