close
Choose your channels

Keeda Cola:ఆసక్తికరంగా తరుణ్ భాస్కర్ 'కీడా కోలా' ట్రైలర్.. హ్యాట్రిక్ కొడతాడా..?

Wednesday, October 18, 2023 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

'పెళ్లి చూపులు', 'ఈ నగరానికి ఏమైంది' సినిమాలతో యువతను అలరించడంతో పాటు తనకంటూ ప్రత్యేక పేరు సంపాందించుకున్న డైరెక్టర్ తరుణ్‌ భాస్కర్. తొలి చిత్రం 'పెళ్లి చూపులు'తోనే ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్నారు. రౌడీ బాయ్ విజయ్ దేవరకొండను హీరోగా పెట్టి తీసిన తొలి చిత్రం ఇది. చిన్న బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలు కొల్లగొట్టింది. ఆ తర్వాత విశ్వక్ సేన్‌తో తీసిన 'ఈ నగరానికి ఏమైంది' సినిమా అయితే యూత్‌ను బాగా ఆకట్టుకుంది. ఇటీవల ఈ మూవీ రీరిలీజ్‌లో కూడా ఆకట్టుకుంది.

కోలాలో బొద్దింక.. ఒకే కథలో మూడు కథలు..

ఆ తర్వాత నటుడిగా కొసాగుతున్న తరుణ్‌ భాస్కర్ ఇప్పుడు తన మూడో సినిమాకు దర్శకత్వం వహించారు. 'కీడా కోలా' అనే విభిన్నమైన టైటిల్‌తో ఓ సినిమాను తెరెక్కించారు. ఈ సినిమాలో హాస్య బ్రహ్మ 'బ్రహ్మనందం' ప్రధాన పాత్ర పోషించడం విశేషం. ఇటీవల విడుదలైన టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచగా.. తాజాగా ఈ మూవీ టైలర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఇందులో తరుణ్‌ భాస్కర్ రౌడీగా జైలు నుంచి బయటకు రావడం, బ్రహ్మనందం, చైతన్యరావు కోటి రూపాయల కోసం ఏదో సమస్యలో చిక్కుకున్నట్లు, వారిని ఓ బిజినెస్‌మెన్‌ బెదిరించడం.. మరోవైపు కార్పొరేటర్‌పై జీవన్ పగ పెంచుకోవడం, చివరగా కోలాలో బొద్దింక ఇరుకున్నట్లు చూపించారు. ఇలా ఒకే కథలో మూడు కథలు చూపించి సినిమాపై మరింత ఇంట్రస్ట్ కల్పించారు.

నవంబర్ 3న థియేటర్లలోకి..

ఈ సినిమాలో బ్రహ్మానందంతో పాటు ’30 వెడ్స్ 21′ సిరీస్ ఫేమ్ చైతన్య రావు, రవీంద్ర విజయ్, విష్ణు, రాగ్ మయూర్, తరుణ్‌ భాస్కర్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. క్రైమ్ కామెడీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి వివేక్ సాగర్ సంగీతం అందించారు. నవంబర్ 3న ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది. మరి గత రెండు చిత్రాల మాదిరిగానే ఈ చిత్రం కూడా యూత్‌ను అలరిస్తుందో లేదో వేచి చూడాలి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.