close
Choose your channels

దెయ్యం ప‌ట్టిన టాక్సీ క‌థే.. టాక్సీవాలా

Monday, November 12, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఆటోడ్రైవ‌ర్, లారీ డ్రైవ‌ర్ అంటే.. ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు క‌దా.. టాక్సీవాలా అంటే కూడా అలాంటి క‌మ‌ర్షియ‌ల్ మూవీ అనుకున్నారంద‌రూ. అయితే ఇది హార‌ర్ సైఫై థ్రిల్ల‌ర్ అని ట్రైల‌ర్ చూస్తే అర్థ‌మైంది. ఐదేళ్లు క‌ష్ట‌ప‌డి డిగ్రీ పాసైన కుర్రాడు.. త‌న ద‌గ్గ‌రున్న డ‌బ్బుతో ఓ కారు కొంటాడు. దాని వ‌ల్ల అత‌నికి జీవితంలో మంచి విష‌యాలు జ‌రుగుతూ ఉంటాయి. ఓ అమ్మాయితో ప్రేమ‌లో కూడా ప‌డ‌తాడు. అంతా స‌వ్యంగా సాగుతున్న స‌మ‌యంలో కారులో ఓ దెయ్యం ఉంద‌ని హీరోకి అర్థ‌మ‌వుతుంది. అస‌లు కారులో దెయ్యం ఎవ‌ర‌నేదే సినిమా మెయిన్ క‌థాంశం.

ముందు హీరోకి ఆ విష‌యం అర్థ‌మవుతుంది. త‌ను ఎంత చెప్పినా ఎవ‌రు విన‌రు. ఇంత‌కు కారులో దెయ్యం నిజంగా ఉందా? ఉంటే ఆ కారులోనే ఎందుకు? ఆ దెయ్యం ల‌క్ష్య‌మేంటి? అనే అంశాల చుట్టూనే సినిమా ర‌న్ అవుతుంది. రాహుల్ సంక్రిత్యాన్ ద‌ర్శ‌క‌త్వంలో జి.ఎ 2 పిక్చ‌ర్స్‌, యు.వి.క్రియేష‌న్స్ బ్యాన‌ర్స్‌పై ఎస్‌.కె.ఎన్ నిర్మాత‌గా సినిమా న‌వంబ‌ర్ 17న విడుద‌ల‌వుతుంది.

ప్రియాంక జ‌వాల్క‌ర్ హీరోయిన్‌, మాళ‌వికా నాయ‌ర్ కీల‌క పాత్ర‌లో న‌టించింది. ఈ సినిమాను విడుద‌ల‌కు ముందే పైర‌సీ చేసేశారు. నిర్మాత‌లు చ‌ర్య‌లు తీసుకున్నారు కూడా. కంటెంట్‌పై న‌మ్మ‌కంతో ధైర్యంగా ముందుకు వ‌స్తున్నారు. సుజిత్ సారంగ్ సినిమాటోగ్ర‌ఫీ, జె.కె.బిజోయ్ సంగీతం సినిమాకు ఎసెట్ అవుతాయ‌ని యూనిట్ న‌మ్మ‌కంగా ఉంది. మ‌రి పెళ్ళిచూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం సినిమాల‌తో వ‌రుస విజ‌యాల‌ను అందుకున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు నోటా చిత్రం కాస్త బ్రేక్ వేసింది. మ‌రి టాక్సీవాలా గేరు మార్చి స్పీడు పెంచుతుందా? అంటే ఈ నెల 17వ‌ర‌కు వెయిట్ చేయాల్సిందే.

 

 

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.