close
Choose your channels

Chandrababu Naidu:రజనీపై ఘాటు విమర్శలు.. వైసీపీ నేతలపై తలైవా ఫ్యాన్స్ గరం, స్పందించిన చంద్రబాబు

Monday, May 1, 2023 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారకరామారావు శతజయంతి వేడుకలు ఇటీవల విజయవాడలో జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సూపర్‌స్టార్ రజనీ కాంత్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా తన జీవితంపై ఎన్టీఆర్ ప్రభావం, ఆయనతో తనకున్న అనుబంధాన్ని రజనీ గుర్తుచేసుకున్నారు. సరిగ్గా ఇదే సమయంలో చంద్రబాబు విజన్, పరిపాలన తదితర అంశాలపై సూపర్‌స్టార్ చేసిన వ్యాఖ్యలపై ఏపీలోని అధికార వైసీపీకి చెందిన నేతలు భగ్గుమన్నారు. మంత్రులు రోజా, అంబటి రాంబాబుతో పాటు ఎమ్మెల్యేలు కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాసరావులు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

వైసీపీ నేతలను ట్రోల్ చేస్తున్న రజనీ ఫ్యాన్స్ :

అయితే రజనీని టార్గెట్ చేసి ఆయనపై వైసీపీ నేతలు విమర్శలు గుప్పించడం వివాదాస్పదమైంది. దీంతో సూపర్‌స్టార్ అభిమానులు రెచ్చిపోయారు. తక్షణం తమ అభిమాన నటుడికి వైసీపీ నేతలు క్షమాపణలు చెప్పాలంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. రజనీకాంత్‌పై వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలను తెలుగు ప్రజలు సహించరని అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

‘‘అన్నగారి శత జయంతి కార్యక్రమంలో పాల్గొని ఆయనతో తన అనుబంధాన్ని...అనుభవాలను పంచుకున్న సూపర్ స్టార్ రజనీకాంత్ గారిపై వైసీపీ మూకల అసభ్యకర విమర్శల దాడి అభ్యంతరకరం, దారుణం. సమాజంలో ఎంతో గౌరవం ఉండే రజనీ కాంత్ లాంటి లెజెండరీ పర్సనాలటీపై కూడా వైసీపీ నేతలు చేస్తున్న నీచ వ్యాఖ్యలు అందరికీ బాధ కలిగిస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వ పోకడలపై ఆయన చిన్న విమర్శ చేయలేదు...ఎవరినీ చిన్న మాట అనలేదు. పలు అంశాలపై కేవలం తన అభిప్రాయాలు పంచుకున్నారు. అయినా తీవ్ర అహంకారంతో ఆయనపై చేస్తున్న ఆర్థం లేని విమర్శలను తెలుగు ప్రజలు ఎవరూ సహించరు. శిఖరం లాంటి వ్యక్తిత్వం కలిగిన రజనీ క్యారెక్టర్ పై మీ పార్టీ నేతల విమర్శలు ఆకాశం పై ఉమ్మి వేయడమే. నోటిదూల నేతలను జగన్ అదుపులో పెట్టుకోవాలి....జరిగిన దానికి క్షమాపణ చెప్పి తమ తప్పు సరిదిద్దుకోవాలి ’’ అని చంద్రబాబు డిమాండ్ చేశారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.