close
Choose your channels

మేం వైసీపీలో చేరట్లేదు.. టీడీపీ ఎమ్మెల్యేల క్లారిటీ

Tuesday, June 2, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఊహించని షాక్ తగలనుందని.. ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు ఆ పార్టీకి టాటా చెప్పడానికి సిద్ధమైపోయారని.. ఇప్పటికే ఆ ఇద్దరు మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డితో ప్రత్యేకంగా భేటీ అయ్యి చర్చించారని గత వారం రోజులుగా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఆ ఇద్దరు మరెవరో కాదు.. అనగాని సత్యప్రసాద్, ఏలూరి సాంబశివరావు భేటీ అయ్యారు. వారిలో ఒకరు గుంటూరు జిల్లా రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్, మరొకరు ప్రకాశం జిల్లా పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు. అన్నీ అనుకున్నట్లు జరిగితే ముహూర్తం ఫిక్స్ చేసుకుని వైసీపీ కండువా కప్పుకోనున్నారని వార్తలు వినిపించాయి. అయితే తాజాగా ఈ వ్యవహారంపై ఇద్దరూ క్లారిటీ ఇచ్చేసుకున్నారు.

సవాల్.. నిరూపిస్తే తప్పుకుంటా!

‘నేను వైసీపీలో చేరబోతున్నానంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదు. కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఇలాంటి ప్రచారం జరగడం ఇది మూడోసారి. మా అధినేత చంద్రబాబు చేస్తున్న ప్రతి పోరాటం వెనుక నేను ఉంటున్నా. అందుకే నాపై కొందరు ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారు. మార్చి 20 నుంచి నిన్నమొన్నటి వరకు నేను అసలు ఏపీలోనే లేను. నేను ఏపీలో ఉన్నానని కానీ, మంత్రి బాలినేనిని ఒంగోలులో కలిశానని కానీ రుజువు చేస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటాను. పార్టీ మారాలని ఎంతో మంది అడుగుతుంటారు.. అంత మాత్రాన పార్టీ మారుతున్నట్టు కాదు. మహానాడులో నేను కూడా పాల్గొన్నా. తీర్మానం ప్రవేశపెట్టిన రోజున నా సోదరుడి పుట్టినరోజు ఉందని.. అందుకే ఆ రోజు రాలేకపోయాను. ఇందుకు సంబంధించి సమాచారాన్ని పార్టీ కార్యాలయానికి ముందుగానే ఇచ్చాను. తెలుగుదేశం పార్టీని వీడే ప్రసక్తే లేదు. చంద్రబాబును మళ్లీ ముఖ్యమంత్రిని చేసేందుకు కృషి చేస్తాను’ అని అనగాని వివరణ ఇచ్చుకున్నారు.

తేల్చేసిన ఏలూరి..

ఇటీవలే పార్టీ ముఖ్య కార్యకర్తలు, అనుచరులతో మీటింగ్ ఏర్పాటు చేసిన తర్వాత టీడీపీకి టాటా చెప్పడంపై పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు తేల్చేశారు. ‘టీడీపీని వీడతానంటూ జరిగిన ప్రచారాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. కొందరు కావాలనే పనికట్టుకుని నాపై దుష్ప్రచారం చేశారు. నాకు తెలుగు దేశం పార్టీని వీడే ఆలోచన లేదు. నేను ఏ పార్టీకి చెందిన వ్యక్తులతో సంప్రదింపులు జరపలేదు. నాకు రాజకీయ భవిష్యత్తును ఇచ్చింది తెలుగుదేశం పార్టీనే. నా నిబద్ధతకు ప్రశ్నించే విధంగా నాపై కొన్ని వార్తలు వచ్చాయి. కొన్ని వార్తలు నన్ను చాలా బాధించాయి. నా వ్యక్తిత్వాన్ని దెబ్బ తీసే విధంగా వచ్చిన వార్తలు ఖండిస్తున్నాను’ అని ఏలూరి క్లారిటీ ఇచ్చుకున్నారు.

వాళ్ల సంగతేంటో..!

మొత్తానికి చూస్తే.. ఇద్దరు ఎమ్మెల్యేలు వివరణ ఇచ్చుకున్నారు. అయితే వైసీపీ మీడియాలో, వైసీపీ వీరాభిమానులు సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవాల్లేవని తేలిపోయింది. సో.. దీనిపై వైసీపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాలి. మరీ ముఖ్యంగా ఈ ఇద్దరితో పాటు మరో 9 మంది ఎమ్మెల్యేలు కూడా టీడీపీకి టాటా చెప్పడానికి రెడీగా ఉన్నారని సీఎం వైఎస్ జగన్ గ్రీన్ సిగ్నల్ రాజీనామా చేసి మరీ వైసీపీ కండువా కప్పుకోవడానికి రెడీగా ఉన్నారని వార్తలు వస్తున్నాయ్. మరి వారెప్పుడు స్పందించి ఈ ఇద్దరిలాగే క్లారిటీ ఇస్తారో వేచి చూడాలి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.