పార్టీ మారడానికి సిద్ధమైన టీడీపీ ఎంపీ!

  • IndiaGlitz, [Wednesday,February 13 2019]

ఎన్నికలు దగ్గరపడుతుండటంతో నేతలు జంపింగ్‌‌లు షురూ చేశారు. రోజురోజుకు ప్రతిపక్ష వైసీపీ, జనసేనకు నేతలు క్యూ కడుతున్నారు. ఇప్పటికే పలురు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీలు గోడ దూకిన సంగతి తెలిసిందే. అయితే బుధవారం రోజు కూడా 2014 ఎన్నికల్లో ఇండిపెండెంట్‌‌గా గెలిచి టీడీపీ తీర్థం పుచ్చుకున్న ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌.. వైసీపీ అధినేత జగన్‌ను కలిసిన విషయం విదితమే. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పలువురు కాపు నేతలు, ప్రముఖులు వైసీపీ తీర్థం పుచ్చుకోవడానికి రెడీ ఉన్నారని చెప్పుకొచ్చారు.

కాగా.. ఆమంచి పార్టీ మారి సరిగ్గా 24 గంటలు కూడా గడవకముందే అనకాపల్లి టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్ సైకిల్‌ దిగడానికి సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా అవంతి టీడీపీకి గుడ్ ‌బై చెబుతారని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి వార్తలు గుప్పుమనడంతో అసలేంటి సంగతి అని ఆరాతీయగా... సన్నిహితులు, అభిమానులు, అనుచరుల ముందు అవంతి.. ‘పార్టీ మనకేం ఇచ్చింది.. ఇన్ని రోజులుగా పార్టీలో ఉన్నాం కదా మనకేం లాభం’ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పార్టీలో సరైన గుర్తింపు ఇవ్వలేదని.. గత ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటు ఇవ్వకపోగా.. రానున్న ఎన్నికల్లో కూడా సీటిచ్చేది లేదని అధిష్టానం తేల్చిచెప్పినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన పార్టీ మారాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

కాగా.. భీమిలి నుంచి పోటీ చేయాలని అవంతి తహతహలాడుతున్నారట. గతంలో వైసీపీ కీలకనేతలతో భీమిలీ సీటిస్తే పార్టీ తీర్థం పుచ్చుకుంటానని చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. మరోవైపు ఈసారి మళ్లీ భీమిలీ నుంచే పోటీ చేస్తానని.. అవసరమైతే తన కుమారుడ్ని కూడా రాజకీయాల్లోకి తీసుకురావాలని మంత్రి గంటా శ్రీనివాసరావు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీంతో అవంతి ఆశలు ఆవిరయ్యాయి. అందుకే ఈసారి పార్టీ మారైనా సరే భీమిలి పోటీ చేయాలని దృఢ నిశ్చయంతో అవంతి ఉన్నారట. అయితే ఆయన రాజీనామా చేసి ఏ పార్టీలోకి వెళ్తారు..? ఎక్కడ్నుంచి పోటీ చేస్తారనే విషయం తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే మరి.

More News

జయరామ్ హత్యకేసు: శిఖాకు ఊహించని వ్యక్తి మద్దతు!

తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. అమెరికాలో ఎన్నారై చిగురుపాటి జయరామ్ ‌‌హత్య కేసు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

స్క్రీనింగ్‌కు సేనాని గ్రీన్‌సిగ్నల్.. వడపోత కత్తిమీద సామే.!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నేడో,రేపో ఎన్నికల కోడ్ మొదలవుతుందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సంకేతాలు ఇవ్వడంతో పాటు, ప్రత్యేక హోదాపై ఢిల్లీలో పోరుబాట పట్టారు.

జగన్ సంచలన నిర్ణయం.. షర్మిళకు కీలక బాధ్యతలు!

వైఎస్ షర్మిళకు కీలక బాధ్యతలు అప్పగించాలని వైసీపీ అధినేత జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారా..? అన్నీ అనుకున్నట్లు జరిగితే మరో పదిరోజుల్లో ఆమెకు పార్టీ పగ్గాలు ఇవ్వాలని భావిస్తున్నారా..?

పాతిక కేజీల బియ్యంకాదు.. పాతికేళ్ల భవిష్యత్తే నా లక్ష్యం!

2019 ఎన్నికలు దగ్గరపడుతుండటంతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరింత స్పీడ్ పెంచారు. ఇప్పటికే పలువురు మేథావులు, ప్రముఖులు,

కేఏ పాల్‌‌పై ప్రముఖ లేడీ యాంకర్ షాకింగ్ కామెంట్స్!

"ఏపీలో జరగబోయే ఎన్నికల్లో వంద సీట్లతో గెలుస్తున్నాను.. రాష్ట్రానికి కాబోయే సీఎం నేనే.. నన్ను తప్ప ప్రజలు ఎవర్నీ ఆదరించరు.