close
Choose your channels

Telangana Budget:రూ.2.75లక్షల కోట్లతో తెలంగాణ బడ్జెట్.. ఏ శాఖకు ఎంత కేటాయించారంటే..?

Saturday, February 10, 2024 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

రూ.2లక్షల 75వేల 891కోట్లతో తెలంగాణ ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. కేసీఆర్ హయాంలో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేశారని మండిపడ్డారు. ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు ఇచ్చే పరిస్థితి లేకుండా పోయిందని పేర్కొన్నారు. దళిత బంధు పథకానికి బడ్జెట్‌లో రూ.17,700 కోట్లు కేటాయించిన గత ప్రభుత్వం.. ఒక్క పైసా కూడా విడుదల చేయలేదని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులను శ్వేతపత్రం ద్వారా ప్రజలకు తెలియజేశామని తెలిపారు.

కానీ ప్రజా సంక్షేమం కోసం ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టంచేశారు. ఆరు గ్యారంటీలను అమలు చేసి తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం తెస్తామని వెల్లడించారు. త్వరలోనే రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీపై కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. అందుకు విధివిధానాలను రూపొందిస్తున్నామని చెప్పుకొచ్చారు. జాబ్ క్యాలెడర్ ప్రకారం ఉద్యోగాల భర్తీ చేస్తామని.. త్వరలోనే మెగా డీఎస్సీ ఉంటుందని తెలిపారు. అలాగే త్వరలో 15 వేల కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ చేసి నియామక పత్రాలు ఇస్తామన్నారు.

ఓట్‌-ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ అంచనాలు..

మొత్తం వ్యయం- రూ. 2,75,891 కోట్లు
రెవెన్యూ వ్యయం- రూ. 2,01,178 కోట్లు
మూలధన వ్యయం- రూ. 29,669 కోట్లు

శాఖల వారీగా కేటాయింపులు..

ఆరు గ్యారెంటీల అమలుకు- రూ.53,196 కోట్లు
పరిశ్రమల శాఖ రూ.2,543 కోట్లు
ఐటీ శాఖకు రూ.774 కోట్లు.
పంచాయతీ రాజ్ రూ.40,080 కోట్లు
పురపాలక శాఖకు రూ.11,692 కోట్లు
మూసీ రివర్ ఫ్రాంట్ రూ.1000 కోట్లు
వ్యవసాయ శాఖ రూ.19,746 కోట్లు
ఎస్సీ, ఎస్టీ గురుకుల భవన నిర్మాణాలు- రూ. 1,250 కోట్లు
ఎస్సీ సంక్షేమం- రూ. 21,874 కోట్లు
ఎస్టీ సంక్షేమం- రూ. 13,013 కోట్లు
మైనార్టీ సంక్షేమం- రూ. 2,262 కోట్లు
బీసీ సంక్షేమం, బీసీ గురుకుల భవనాల నిర్మాణం కోసం- రూ. 1,546 కోట్లు
బీసీ సంక్షేమం- రూ.8వేల కోట్లు
విద్యా రంగానికి- రూ. 21,389కోట్లు
తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటుకు- రూ.500 కోట్లు
యూనివర్సిటీల్లో సదుపాయాలకు- రూ.500 కోట్లు
వైద్య రంగానికి- రూ.11,500 కోట్లు
విద్యుత్ (గృహజ్యోతికి)- రూ.2,418 కోట్లు
విద్యుత్ సంస్థలకు- రూ. 16,825 కోట్లు
గృహ నిర్మాణానికి- రూ. 7,740 కోట్లు
నీటి పారుదల శాఖకు- రూ.28,024 కోట్లు
సమ్మక్క సారలమ్మ జాతరకు- రూ.110 కోట్లు

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.