close
Choose your channels

బాహుబలికి ఆది లేదు అంతం లేదు - నేను లేకపోయినా బాహుబలి ఎప్పటికీ ఉండాలి - రాజమౌళి

Friday, September 30, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వ‌వ్యాప్తం చేసిన సంచ‌ల‌న చిత్రం బాహుబ‌లి. ప్ర‌భాస్, రానా, అనుష్క‌, త‌మ‌న్నా, ర‌మ్య‌కృష్ణ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించిన బాహుబ‌లి చిత్రాన్ని ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించారు.ఈ సంచ‌ల‌న చిత్రం రెండో భాగంగా బాహుబ‌లి 2 అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందుతుంది. ఏప్రిల్ 28న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు బాహుబ‌లి 2 రెడీ అవుతుంది. ఈ సంద‌ర్భంగా చిత్ర విశేషాల‌ను తెలియ‌చేయ‌డానికి బాహుబ‌లి 2 టీమ్ ఫ‌స్ట్ ప్రెస్ మీట్ ను హైద‌రాబాద్ ద‌స‌ప‌ల్లా హోట‌ల్లో ఏర్పాటు చేసారు. ఈ ప్రెస్ మీట్ లో రానా బాహుబ‌లి 2 లోగో ఆవిష్క‌రించారు.
ఈ సంద‌ర్భంగా రానా మాట్లాడుతూ... నేను ఫిల్మ్ ల‌వ‌ర్ ని. చిన్న‌ప్ప‌టి నుంచి ఇంగ్లీషు సినిమాలు చూసేవాడిని. వార్ మూవీస్ అంటే బాగా ఇష్టం. ఆ సినిమా సంబంధించిన‌ పుస్త‌కాలు ఎక్కువ చ‌దివేవాడిని. రాజ‌మౌళి గార్ని క‌లిసిన‌ప్పుడు బాహుబ‌లి క‌థ చెప్ప‌కుండా మ‌హిష్మ‌తి రాజ్యం ఎలా ఉంటుందో చూపించారు. ఇంకా చెప్పాలంటే...ఒక వ‌ర‌ల్డ్ క్రియేట్ చేసారు.ఈ సినిమాకి సంబంధించి ప్ర‌తి ఒక్క అంశంలో చాలా కేర్ తీసుకున్నాం. భార‌త‌దేశంలోనే ఇలాంటి సినిమా రాలేదు. మ‌నం చాలా సినిమాల‌ను టీష‌ర్ట్స్ తో ప్ర‌మోష‌న్స్ చేస్తుంటాం. బాహుబ‌లి 2 ను ప్ర‌మోష‌న్స్ కు సంబంధించిన గేమ్స్, టీ ష‌ర్ట్స్ ఇలా అన్నివెరీ వెరీ హై క్వాలిటీతో ఉండేలా ప్లాన్ చేస్తున్నాం అన్నారు.
నిర్మాత శోభు యార్ల‌గ‌డ్డ‌ మాట్లాడుతూ... మెయిన్స్ సీన్స్ కు సంబంధించిన షూటింగ్ దాదాపు పూర్తి అయ్యింది. రెండు పాట‌లు, కొన్ని సీన్స్ షూటింగ్ చేయాల్సి ఉంది. మిగిలిన షూటింగ్ అక్టోబ‌ర్ నుంచి స్టార్ట్ చేసి డిసెంబ‌ర్ కి పూర్తి చేస్తాం. బాహుబ‌లి 2 చిత్రాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా ఏప్రిల్ 28న రిలీజ్ చేస్తాం. ట్రైల‌ర్ ను జ‌న‌వ‌రిలో రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం అన్నారు.
ప్ర‌భాస్ మాట్లాడుతూ... బాహుబ‌లి 2 ఫ‌స్ట్ లుక్ ను నా పుట్టిన‌రోజు కానుక‌గా అక్టోబ‌ర్ 22 రిలీజ్ చేస్తున్నాం అన్నారు.
రాజ‌మౌళి మాట్లాడుతూ... అక్టోబ‌ర్ నెల మాకు చాలా ముఖ్య‌మైన నెల‌. ఎందుకంటే ఈ సినిమాకి సంబంధించిన ర‌క‌ర‌కాల విష‌యాలును తెలియ‌చేయ‌నున్నాం. బాహుబ‌లి కార్టూన్ సీరిస్ ను అక్టోబ‌ర్ 1న రిలీజ్ చేస్తున్నాం. అలాగే అక్టోబ‌ర్ 5న ప్ర‌భాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్ప‌బోతున్నాం. ప్ర‌భాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ అంటే ప్ర‌భాస్ పెళ్లి వార్త అనుకుంటే పొర‌పాటే అది కాదు. ప్ర‌భాస్ ఫ్యాన్స్ మాత్ర‌మే కాదు సౌతిండియా ప్రౌడ్ గా ఫీల‌య్యే న్యూస్ చెప్ప‌బోతున్నాం. బాహుబ‌లి అనే మ‌హావృక్షం గురించి గేమ్స్, కామిక్స్... ఇలా ప్ర‌తిదీ హైయ్య‌స్ట్ క్వాటిలీతో చేస్తున్నాం. వ‌ర్చువ‌ల్ రియాలిటీ ద్వారా ప్రేక్ష‌కుల‌కు కొత్త అనుభూతి క‌లిగించే ప్ర‌య‌త్నం చేస్తున్నాం. అస‌లు వ‌ర్చువ‌ల్ రియాలిటీ అంటే ఏమిటంటే....సినిమాలో ఉన్న క్యారెక్ట‌ర్ లా ఆ సీన్ లో ఉండి చూస్తున్న‌ట్టు అనుభూతి క‌లిగించేది వ‌ర్చువ‌ల్ రియాలిటి. ఇంకా చెప్పాలంటే మ‌హిష్మ‌తి ప్ర‌పంచంలోకి తీసుకెళ్లి అక్క‌డ నుంచి చూస్తున్న ఫీలింగ్ క‌లిగించే ప్ర‌య‌త్నం చేస్తున్నాం.
అలాగే స్మార్ట్ ఫోన్ ద్వారా కూడా చూపించే ప్ర‌య‌త్నం చేస్తున్నాం. 200, 300 ధియేట‌ర్స్ లోఇలాంటి అనుభూతిని క‌లిగించేలా ఏర్పాట్లు చేస్తున్నాం. ప్ర‌పంచంలోనే ఇలా చేయ‌డం ఇదే ఫ‌స్ట్ టైమ్. 25 కోట్ల బ‌డ్జెట్ తో దీనిని ప్లాన్ చేస్తున్నాం. అలాగే మేకింగ్ వీడియోస్ ను కూడా హ‌య్య‌స్ట్ క్వాలిటీతో రిలీజ్ చేస్తున్నాం. ఫ‌స్ట్ మేకింగ్ వీడియో అక్టోబ‌ర్ 23న రిలీజ్ చేస్తున్నాం.
బాహుబ‌లి 2 ఫ‌స్ట్ క‌ట్ ఈరోజు చూసాను.యు.ఎస్ వెళ్లి వ‌ర్చ‌వ‌ల్ రియాలిటీ ఎలా ఉంటుందో చూసాను. యు.ఎస్ లో చూసిన‌ క్వాలిటీ క‌న్నా బెట‌ర్ క్వాలిటీతో మేకింగ్ వీడియోస్ రిలీజ్ చేస్తున్నాం. అక్టోబ‌ర్ 1న కామిక్ సీరిస్ రిలీజ్ అవుతుంది.
ఈగ సినిమాకి సంబంధించిన అన్ని విష‌యాలును ముందే చెప్పేసాను. కానీ బాహుబ‌లి క‌థ‌కు సంబంధించి ముందుగా రివీల్ చేయ‌కూడ‌దు. అందుక‌నే క‌థ గురించి చెప్ప‌డం లేదు. బాహుబ‌లి క‌థ‌ను సినిమాలోనే చూడ‌డం క‌రెక్ట్ అని ఫీలింగ్. బాహుబ‌లి 2లో త‌మ‌న్నా పై సాంగ్స్ ఉండ‌వు. అనుష్క పై సాంగ్స్ ఉంటాయి. అన్నిర‌కాలుగా క‌ష్ట‌మైన క్లైమాక్స్ పూర్త‌య్యింది. గ్రాఫిక్స్ కూడా ఇచ్చేసాం. వెరీ వెరీ హ్యాఫీగా ఉంది. రెండు సాంగ్స్ సింపుల్ యాక్ష‌న్ సీన్స్ బ్యాలెన్స్ ఉంది. డిసెంబ‌ర్ కి మొత్తం పూర్త‌వుతుంది.
మ‌హావృక్షం నుంచి బాహుబ‌లి అనేది కొమ్మ మాత్ర‌మే. ఇది బిగినింగ్ కాదు అలాగ‌ని ఎండింగ్ కాదు. ఈ సినిమాకి నేష‌న‌ల్ ఆడియోన్స్ టార్గెట్ గా రూపొందించాను. ఈ సినిమాకి సంబంధించి టెక్నాల‌జీ అంతా ఎ.ఎం.డి అనే సంస్థ అందిస్తుంది. యానిమేటెడ్ సీరియ‌స్ ను అన్నికంటే హ‌య్య‌స్ట్ బ‌డ్జెట్ తో కంటిన్యూ చేస్తాం. దీనికి వేరే క‌థ ఉంటుంది. ఇది 2డి లో ఉంటుంది. నేను లేక‌పోయినా బాహుబ‌లి కంటిన్యూ అవ్వాలి. మ‌నిషి ఆశ‌కు అంతు ఉండ‌దు ఆస్కార్ కొట్టాల‌ని ఉంటుంది. బాహుబ‌లి 2 సినిమా చూస్తుంటే ఫ‌స్ట్ పార్ట్ లో ఏం జ‌రిగింది. ఇప్పుడు ఏం జ‌రుగుతుంది అని కాకుండా కంప్లీట్ ఆ ప్ర‌పంచంలోకి తీసుకువెళ్లాలి దానికి కోస‌మే మా ప్ర‌య‌త్నం అన్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.