close
Choose your channels

డబ్భైశాతం షూటింగ్ పూర్తి చేసుకున్న తిక్క

Saturday, April 9, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
సాయిధ‌ర‌మ్ తేజ్, లారిస్సా బొనేసి జంట‌గా సునీల్ రెడ్డి తెర‌కెక్కిస్తున్న చిత్రం తిక్క‌. ఈ చిత్రాన్ని శ్రీ వెంక‌టేశ్వ‌ర మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ పై డా.సి.రోహిణ్ కుమార్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఉగాది సంద‌ర్భంగా తిక్క టీమ్ చిత్ర విశేషాల‌ను మీడియాతో పంచుకున్నారు.
నిర్మాత డా.సి.రోహిణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ...తిక్క సినిమా డ‌బ్బై శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈనెల 12 నుంచి మ‌లేషియాలో క్లైమాక్స్ చిత్రీక‌రించ‌నున్నాం. దీంతో మూడు పాట‌లు మిన‌హా టాకీ పూర్త‌వుతుంది. జూన్ మూడోవారంలో ఆడియో రిలీజ్ చేసి జులైలో సినిమాను రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం. మా సంస్థ‌లో రెండో చిత్రంగా న‌వీన్ తో ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. ఈ చిత్రానికి శ‌శాంక్ ఏలేటి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. జూన్ లో ఈ చిత్రాన్ని ప్రారంభించ‌నున్నాం అన్నారు.
హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ మాట్లాడుతూ...ఉగాది సంద‌ర్భంగా తిక్క సినిమాకి సంబంధించిన వెబ్ సైట్ ప్రారంభించ‌డం ఆనందంగా ఉంది. ఓ మంచి సినిమా అందించాల‌ని అంద‌రూ హార్డ్ వ‌ర్క్ చేస్తున్నాం. నా బెస్ట్ ఫ్రెండ్ న‌వీన్ తో మా నిర్మాత ఓ చిత్రాన్ని నిర్మిస్తుండ‌డం సంతోషంగా ఉంది అన్నారు.
డైరెక్ట‌ర్ సునీల్ రెడ్డి మాట్లాడుతూ...మే నెలాఖ‌రుకి షూటింగ్ పూర్త‌వుతుంది. జులైలో తిక్క చిత్రాన్ని రిలీజ్ చేయ‌నున్నాం. న‌వీన్ తో సినిమా నిర్మిస్తున్న టీమ్ కి ఆల్ ది బెస్ట్ చెప్పారు.
హీరో న‌వీన్ మాట్లాడుతూ...ఇది నా మూడ‌వ సినిమా. శ‌శాంక్ మంచి స్ర్కిప్ట్ తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. అంద‌ర్నీ ఆక‌ట్టుకుని ఈ చిత్రం విజ‌యం సాధిస్తుంద‌ని ఆశిస్తున్నాను అన్నారు.
డైరెక్ట‌ర్ శ‌శాంక్ మాట్లాడుతూ...హీరో న‌వీన్ ఎప్ప‌టి నుంచో నాకు మంచి ఫ్రెండ్. నాకు అవ‌కాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ తెలియ‌చేస్తున్నాను. జూన్ లో ఈ చిత్రాన్ని ప్రారంభించ‌నున్నాం అన్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.