close
Choose your channels

చిరంజీవిగారి ఆ మాటలే నన్ను నటుడిని చేశాయి: పవన్

Monday, April 5, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

చిరంజీవిగారి ఆ మాటలే నన్ను నటుడిని చేశాయి: పవన్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’ చిత్రం ఈ నెల 9న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా ప్రి రిలీజ్ ఈవెంట్ ఆదివారం సాయంత్రం శిల్ప కళావేదికలో వైభవంగా జరిగింది. ఈ ఈవెంట్‌లో పవన్ మాట్లాడిన తీరు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. అభిమానులను తన గుండె చప్పుడుతో పోల్చడంతో అభిమానులు ఆనందంతో ఊగిపోయారు. బండ్ల గణేష్‌లా తాను మాట్లాడలేనని పొలిటికల్ సభ అయితే మాట్లావచ్చు కానీ ఇక్కడ మాట్లాడటం సబబు కాదన్నారు. మూడు సంవత్సరాలు సినిమాలు చేయలేదన్న భావన తనకు కలగలేదన్నారు. సినిమాల్లోకి వచ్చి తాను 24 ఏళ్లు అయిపోయిందంటే తెలియలేదన్నారు.

పని చేసుకుంటూ వెళ్లిపోయానని తనకు అదేమీ తెలియలేదన్నారు. ఇంకా పవన్ మాట్లాడుతూ.. ‘‘దిల్‌ రాజు వంటి ప్రొడ్యూసర్ తనతో సినిమా చేయడం నా అదృష్టంగా భావిస్తున్నా. కలలు కనే వారిని చాలా ఇష్టపడతాను. నా కోసం సినిమాలు చేయండని ఎవరినీ అడగలేదు. మా అన్నయ్య చిరంజీవి గారు అన్న మాట నటుడిని చేసింది. ‘నీకు చిరంజీవి వంటి అన్నయ్య ఉండి.. నీపై ఆధారపడే కుటుంబ సభ్యులు లేరు. ఇవి కాకుండా నువ్వొక నటుడై.. ఇదే స్పిరిట్యువాలిటీ గురించి మాట్లాడగలవా?’ అన్న చిరంజీవిగారి మాటలే నన్ను నటుడిని చేసింది.

నేను ఇంటర్ ఫెయిల్ అయి చదువును వదిలేసిన వ్యక్తిని. నాకు తెలిసిన మొదటి వకీలు నాని పాల్కివాలా. ఎమర్జెన్సీ టైంలో మానవ హక్కుల ఉల్లంఘన కోసం బలంగా వాదించిన వ్యక్తి. అప్పటి నుంచి ఆ వృత్తిపై నాకు చాలా గౌరవం ఉండేది. ప్రకాష్ రాజ్ గారికి, నాకూ పొలిటికల్‌గా విభిన్నమైన దారులుండొచ్చు కానీ సినిమా పరంగా మేమంతా ఒక్కటే. ఛానల్స్‌లో నా గురించి ఏమైనా మాట్లాడితే నాకేం ఇబ్బంది ఉండదు. ఎందుకంటే అది ఆయన అభిప్రాయం. కానీ సినిమా పరంగా ఆయనంటే నాకు చాలా ఇష్టం’’ అని పవన్ పేర్కొన్నారు. అలాగే సినిమాలో చేసిన ప్రతి ఒక్కరి గురించి వివరించారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Related Videos