close
Choose your channels

చానాళ్లకు బాలీవుడ్‌ గడప తొక్కుతోన్న తేజ.. ఇద్దరు స్టార్స్‌తో సినిమా, వివరాలివే...!!

Saturday, April 9, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

దర్శకుడు తేజ.. పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. రామ్‌గోపాల్ వర్మ స్కూల్ నుంచి వచ్చిన ఆయన తనదైన మార్క్ చూపించారు. ‘‘జయం’’, ‘‘నువ్వు నేను’’, ‘‘నిజం’’, ‘‘చిత్రం’’ వంటి వరుస బ్లాక్‌బస్టర్‌లతో తెలుగు నాట తేజ పేరు మారుమోగిపోయింది. ఆయనతో సినిమా చేసేందుకు స్టార్లు సైతం వెయిట్ చేసేవారు. మంచి ఊపు మీదున్న దశలో ఫ్లాప్‌లు పలకరించడంతో తేజ తెలుగు ప్రేక్షకులకు దూరమయ్యారు. ఇక తేజ పని అయిపోయింది అనుకున్న టైంలో ‘‘నేనే రాజు నేనే మంత్రి’’ సినిమాతో తనలో సత్తా ఏమాత్రం తగ్గలేదని నిరూపించారు. ఆ వెంటనే మళ్లీ తెలుగులో బిజీ అయ్యారు. బాలకృష్ణ హీరోగా ఆయన తండ్రి, దివంగత నందమూరి తారక రామారావు బయోపిక్‌ను తేజనే డైరెక్ట్ చేయాల్సి వుంది. కానీ అనుకోని కారణాల వల్ల తేజ తప్పుకుని క్రిష్‌కి ఛాన్స్ దక్కింది. తర్వాత కాజల్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌లతో తేజ తీసిన ‘‘సీత’’ పరాజయం పాలైంది.

ప్రస్తుతం తెలుగులో `అహింస` పేరుతో మరో సినిమా చేస్తున్నారు తేజ. దీని ద్వారా నిర్మాత దగ్గుబాటి సురేష్‌బాబు చిన్న కుమారుడు అభిరామ్‌ని హీరోగా పరిచయం చేయబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. ఇదిలా ఉంటే తేజ మరోసారి బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. అక్కడ ఆయన రెండు సినిమాలు తెరకెక్కించనున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తెలియజేశారు.

అక్కడ టైమ్స్ ఫిల్మ్స్, ఎన్‌హెచ్‌ స్టూడియోస్‌, ట్రిఫ్లిక్స్ ఫిల్మ్స్‌తో కలిసి తేజ సినిమాలను తెరకెక్కించనున్నారు. అందులో ఒకటి `జఖమి`. ఇది కాశ్మీర్‌ నేపథ్యంలో సాగే కథ. ఈ చిత్ర షూటింగ్‌ సైతం కాశ్మీర్‌లోనే జరగనుంది. ఇందులో ఇద్దరు బాలీవుడ్‌ హీరోలు నటించనున్నారని సమాచారం. మరోవైపు `తస్కరి` అనే వెబ్‌ సిరీస్‌ చేస్తున్నారు. 1980` బ్యాక్‌ డ్రాప్‌లో సాగే వెబ్‌ సిరీస్‌ ఇది. నాలుగు సీజన్లుగా రానుంది. ముంబయిలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ వెబ్‌ సిరీస్‌ని రూపొందించబోతున్నారు. ఈ రెండు ప్రాజెక్ట్ లకు సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో ప్రకటించనున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.