close
Choose your channels

న‌వ‌ర‌సాలు ఉన్న ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ త్రిపుర : నిర్మాత చిన‌బాబు

Saturday, October 31, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

క‌ల‌ర్స్ స్వాతి టైటిల్ రోల్ పోషించిన చిత్రం త్రిపుర‌. ఈ చిత్రంలో న‌వీన్ చంద్ర‌, స్వాతి జంట‌గా న‌టించారు. గీతాంజ‌లి ఫేం రాజ్ కిర‌ణ్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. క్రేజీ మీడియా బ్యాన‌ర్ పై చిన‌బాబు ఈ సినిమాని నిర్మించారు. న‌వంబ‌ర్ 6న త్రిపుర మూవీని రిలీజ్ చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా త్రిపుర నిర్మాత చిన‌బాబుతో ఇంట‌ర్ వ్యూ మీకోసం..

త్రిపుర క‌థ ఏమిటి..?

ఓ ప‌ల్లెటూరి అమ్మాయి..సిటీకి వ‌చ్చి ఓ డాక్ట‌ర్ ని పెళ్లి చేసుకుంటుంది. ఆ డాక్ట‌ర్ కి అప్ప‌టికే ఆ అమ్మాయి క‌ల‌లోకి వ‌స్తుంటుంది. ఈ అమ్మాయి పెళ్లికి ముందే ఆ డాక్ట‌ర్ క‌ల‌లోకి ఎందుకు వ‌చ్చింది..? పెళ్లి త‌ర్వాత వీరిద్ద‌రి లైఫ్ లో ఏం జ‌రిగింది అనేదే త్రిపుర క‌థ‌.

త్రిపుర కి మంచి క్రేజ్ రావ‌డానికి కార‌ణం ఏమిట‌నుకుంటున్నారు..?

స్వాతి న‌టించిన స్వామి రా..రా, కార్తీకేయ సినిమాలు స‌క్సెస్ అవ్వ‌డం, మా డైరెక్ట‌ర్ రాజ్ కిర‌ణ్ గీతాంజ‌లి హిట్ త‌ర్వాత చేస్తున్నసినిమా త్రిపుర కావ‌డం, అలాగే స‌క్సెస్ ఫుల్ రైట‌ర్ కోన వెంక‌ట్ మా సినిమాకి స్ర్కీన్ ప్లే అందించ‌డం..రాజీప‌డ‌కుండా మంచి క్వాలీటీతో ఈ మూవీని మేము నిర్మించ‌డం త‌దిత‌ర కార‌ణాల వ‌ల‌న త్రిపుర పై మంచి క్రేజ్ ఏర్ప‌డింది.

గీతాంజ‌లి, త్రిపుర‌..ఈ రెండింటికి తేడా ఏమిటి..?

గీతాంజ‌లి కామెడీ మూవీ, త్రిపుర న‌వ‌ర‌సాలు ఉన్న ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్.

స్వాతిని అనుకుని క‌థ రెడీ చేసారా..? లేక క‌థ కుదిరాక స్వాతిని సెలెక్ట్ చేసారా..?

క‌థ కుదిరాకే స్వాతిని సెలెక్ట్ చేసాం. అంతేకానీ...స్వాతి అనుకుని క‌థ రెడీ చేయ‌లేదు.

త్రిపుర లో హైలెట్స్ ఏమిటి...?

స్వాతి న‌ట‌న‌, కోన స్ర్కీన్ ప్లే, 16 నిమిషాల గ్రాఫిక్స్, సప్త‌గిరి కామెడీ..హైలెట్స్ గా నిలుస్తాయి.

త్రిపుర ఎలాంటి విజ‌యాన్ని సాధిస్తుంది అనుకుంటున్నారు...

త్రిపుర సినిమా మేము అనుకున్న దానిక‌న్నా చాలా బాగా వ‌చ్చింది. శ్రీమంతుడు, రుద్ర‌మ‌దేవి చిత్రాల‌ను డిస్ట్రిబ్యూట్ చేసిన అభిషేక్ పిక్చ‌ర్స్ వాళ్లే మా సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఓ పెద్ద సినిమా స్ధాయ‌లో దాదాపు 600 ధియేట‌ర్స్ లో త్రిపుర సినిమాను రిలీజ్ చేస్తున్నాం.దీనిని బ‌ట్టి అర్ధం చేసుకోవ‌చ్చు ఈ సినిమా పై ఎంత క్రేజ్ ఉందో. ఖ‌చ్చితంగా త్రిపుర హిట్ అవుతుంది.

తమిళ్ లో కూడా త్రిపుర న‌వంబ‌ర్ 6నే రిలీజ్ చేస్తున్నారా..?

అస‌లు మా సినిమాను న‌వంబ‌ర్ 27న రిలీజ్ చేయాల‌నుకున్నాం. అయితే అఖిల్ సినిమా వాయిదా ప‌డ‌డంతో మేము న‌వంబ‌ర్ 6న రిలీజ్ చేస్తున్నాం. త‌మిళ్ లో మాత్రం న‌వంబ‌ర్ 27న రిలీజ్ చేస్తున్నాం.

నెక్ట్స్ ప్రాజెక్ట్ గురించి..

మంచి సినిమాలు నిర్మించాల‌నుకుంటున్నాను. అన్ని కుదిరితే మ‌ళ్లీ స్వాతితో మూవీ ప్లాన్ చేస్తాను.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.