close
Choose your channels

బాలీవుడ్ స్టార్‌పై క‌న్నేసిన త్రివిక్ర‌మ్‌

Tuesday, April 14, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

బాలీవుడ్ స్టార్‌పై క‌న్నేసిన త్రివిక్ర‌మ్‌

అర‌వింద స‌మేత త‌ర్వాత యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో సినిమా రూపొంద‌నున్న సంగ‌తి తెలిసిందే. హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్, ఎన్టీఆర్ట్స్ ప‌తాకాల‌పై ఈ సినిమా నిర్మిత‌మ‌వుతోంది. ప్ర‌స్తుతం రౌద్రం ర‌ణం రుధిరం సినిమాతో బిజీగా ఉన్న ఎన్టీఆర్ ఈ ఏడాది ద్వితీయార్థంలో ఈ సినిమాను స్టార్ట్ చేయ‌బోతున్నారు. వ‌చ్చే ఏడాది సమ్మ‌ర్‌లో సినిమాను విడుద‌ల చేయాల‌నేది ద‌ర్శ‌క నిర్మాత‌ల ఆలోచ‌న‌.

ప్ర‌స్తుతం త్రివిక్ర‌మ్ సినిమా స్క్రిప్ట్‌, డైలాగ్స్‌ను సిద్ధం చేస్తున్నారట‌. తాజా స‌మాచారం మేర‌కు ఈ చిత్రంలో ఓ బాలీవుడ్ స్టార్‌ను విల‌న్‌గా న‌టింప చేయాల‌ని ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ అనుకుంటున్నార‌ట‌. ఆ బాలీవుడ్ స్టార్ ఎవ‌రో కాదు. సంజ‌య్ ద‌త్‌. చ‌ర్చ‌లు స‌ఫ‌ల‌మైతే రాయ‌ల‌సీమ బ్యాక్‌డ్రాప్ ఉన్న విల‌న్‌గా సంజ‌య్ ద‌త్ తెలుగు ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌నున్నారు. ఈ చిత్రానికి అయిన‌ను పోయి రావ‌లె హ‌స్తిన‌కు అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉన్న‌ట్లు వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. అలాగే ఇద్ద‌రు హీరోయిన్స్ న‌టించ‌బోతున్నారు. అల వైకుంఠ‌పురములో సినిమా వంటి భారీ హిట్ త‌ర్వాత త్రివిక్ర‌మ్ డైరెక్ట్ చేస్తున్న చిత్ర‌మిదే.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.