close
Choose your channels

రామ్‌చరణ్‌ని బ్రాడ్‌పిట్ ఆఫ్ ఇండియా అన్న అమెరికన్ టీవీ హోస్ట్.. చెర్రీ రియాక్షన్ ఇదే

Wednesday, March 1, 2023 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

రామ్‌చరణ్‌ని బ్రాడ్‌పిట్ ఆఫ్ ఇండియా అన్న అమెరికన్ టీవీ హోస్ట్.. చెర్రీ రియాక్షన్ ఇదే

ఇప్పుడు తెలుగు చిత్ర సీమతో పాటు యావత్ భారతీయ చిత్ర పరిశ్రమ చూపు.. ఆర్ఆర్ఆర్ సినిమాపైనే వుంది. ఆస్కార్ అవార్డ్స్ బరిలో ఈ చిత్రం వుండటంతో ఆర్ఆర్ఆర్ యూనిట్ అంతా అమెరికాకు పయనమైంది. అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్, కొమురం భీంగా ఎన్టీఆర్ అద్భుత నటనతో పాటు ఆర్ఆర్ఆర్‌లోని యాక్షన్ సీక్వెన్స్‌లు, పాటలు అభిమానులు ఉర్రూతలూగించాయి. ఇప్పటికే నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ దక్కిన సంగతి తెలిసిందే.

అమెరికాలో రాజమౌళి లాబీయింగ్:

బెస్ట్ ఒరిజినల్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వివాదంలో ఆర్ఆర్ఆర్ ఆస్కార్స్ బరిలో నిలిచింది. దీంతో ఆస్కార్ ఖచ్చితంగా దక్కుతుందని యావత్ భారతీయ చిత్ర పరిశ్రమ ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఇప్పటికే జక్కన్న తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రఖ్యాత దర్శకుడు జేమ్స్ కెమెరూన్‌తోనూ ఆయన మిలాఖత్ అయ్యారు. అటు మీడియా కంట్లో పడేందుకు కూడా లాబీయింగ్ చేస్తున్నారు. ఎన్టీఆర్, రామ్‌చరణ్ కూడా తమ వంతుగా పలు టీవీ ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.

రామ్‌చరణ్‌ని బ్రాడ్‌పిట్ ఆఫ్ ఇండియా అన్న అమెరికన్ టీవీ హోస్ట్.. చెర్రీ రియాక్షన్ ఇదే

అమెరికన్ మీడియాలో మెరుస్తోన్న చరణ్:

లాస్ ఏంజిల్స్‌లో అకాడమీ అవార్డ్స్‌కు ముందు ఆర్ఆర్ఆర్ కోసం ప్రమోషనల్, అవార్డ్స్ సీజన్ టూర్‌లో వున్న రామ్‌చరణ్ మంగళవారం మరో టీవీ చాట్ షోలో అతిథిగా కనిపించారు. ఈ సందర్భంగా అతనిని సదరు టీవీ హోస్ట్.. రామ్‌చరణ్‌ను ‘‘బ్రాడ్ పిట్ ఆఫ్ ఇండియా’’ అంటూ సంబోధించిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కేఎల్‌టీఏ ఎంటర్‌టైన్‌మెంట్‌లో కనిపించారు చెర్రీ. ఆర్ఆర్ఆర్ గురించి సామ్ రూబిన్, ఫ్రాంక్ బక్లీ, జెస్సికా హోమ్స్, మార్క్ క్రిస్కీలతో మాట్లాడుతుండగా.. హోస్ట్ చెర్రీని ‘‘బ్రాడ్ పిట్ ఆఫ్ ఇండియా’’ అని సంభోదించారు.

తన కోసం ఆర్ఆర్ఆర్ చూడమన్న చరణ్:

మరి ఈ గౌరవం మీకు ఎలా వుందని హోస్ట్ ప్రశ్నించగా.. చెర్రీ స్పందించారు. తనకు ఆ గౌరవం ఖచ్చితంగా నచ్చుతుందన్నారు. ఈ షోలో రామ్‌చరణ్‌ని బెస్ట్ ఒరిజినల్ సాంగ్‌ కేటగిరీలో ఆర్ఆర్ఆర్ అవార్డ్ గెలిస్తే అప్పుడు మీ ఫీలింగ్ ఎలా వుంటుందని ప్రశ్నించారు. దీనికి చరణ్ స్పందిస్తూ.. ఆ ట్రోఫీని భారతదేశానికి తీసుకెళ్లడానికి క్షణం కూడా ఆలస్యం చేయనన్నారు. ఆర్ఆర్ఆర్ రీ రిలీజ్ కానుండటంతో.. మీరంతా ఖచ్చితంగా తమ కోసం కొంత సమయం కేటాయించాలని రామ్‌చరణ్ కోరారు.

రామ్‌చరణ్‌ని బ్రాడ్‌పిట్ ఆఫ్ ఇండియా అన్న అమెరికన్ టీవీ హోస్ట్.. చెర్రీ రియాక్షన్ ఇదే

అంతర్జాతీయ అవార్డ్‌లు కొల్లగొడుతున్న చరణ్:

ఆర్ఆర్ఆర్‌లోని నాటు నాటు పాట ఇటీవల హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ ఫిల్మ్ అవార్డ్స్‌లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ ట్రోఫీని గెలుచుకుంది. అలాగే బెస్ట్ యాక్షన్ ఫిల్మ్, బెస్ట్ స్టంట్స్, బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీల్లో పలు అవార్డులను కైవసం చేసుకుంది. ఇక.. ‘‘నాటు నాటు’’ పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్‌కు నామినేట్ అయ్యింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 300 భాషల సినిమాలు షార్ట్ లిస్ట్ కాగా.. అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన సినిమాలను ఓటింగ్ ద్వారా ఆస్కార్ అవార్డుల కమిటీ తుది జాబితాకు ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు నామినేషన్స్‌లో చోటు దక్కించుకుంది. లగాన్ తర్వాత ఓ భారతీయ చిత్రం ఆస్కార్ అవార్డుకు నామినేట్ కావడం ఇదే తొలిసారి. ఇకపోతే.. డాక్కుమెంటరీ ఫీచర్ కేటగిరీలో షానూక్‌సేన్ ‘ఆల్ దట్ బ్రెత్స్’, డాక్యుమెంటరీ షార్ట్ సబ్జెక్ట్ విభాగంలో ‘ది ఎలిఫెంట్ విష్పర్స్’ నామినేట్ అయ్యాయి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.