close
Choose your channels

బీజేపీ ఆట మొదలు.. ఇద్దరు వైసీపీ నేతలు జంప్..!

Tuesday, June 25, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

బీజేపీ ఆట మొదలు.. ఇద్దరు వైసీపీ నేతలు జంప్..!

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల అనంతరం తెలుగు రాష్ట్రాలపై బీజేపీ దృష్టి సారించింది. పార్టీని బలోపేతం చేసుకోవడానికి ఇదే సరైన సమయమని భావించిన కమలనాథులు ‘ఆపరేషన్‌ ఆకర్ష్‌’కు తెరలేపారు. ఇప్పటికే టీడీపీకి చెందిన నలుగురు ఎంపీలు.. మరికొందరు ముఖ్యనేతలు కాషాయ కండువాలు కప్పేసుకున్నారు. ఇదిలా ఉంటే త్వరలోనే మరికొందరు టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు సైతం బీజేపీ గూటికి చేరతారని వార్తలు వస్తున్నాయి.

అధికార పార్టీ నుంచి జంపింగ్‌లు!

ఇవన్నీ అటుంచితే.. ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ నుంచి సైతం బీజేపీలోకి వలసలు మొదలయ్యాయి. మంగళవారం సాయంత్రం ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ సమక్షంలో వైసీపీకి చెందిన ఇద్దరు నేతలు విజయభాస్కరరెడ్డి, వజ్ర భాస్కరరెడ్డి కండువాలు కప్పుకున్నారు. ఈ చేరిక అనంతరం కన్నా మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ అభివృద్ధి ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోనే సాధ్యమని ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల అనంతరం ప్రజలు నమ్ముతున్నారన్నారు. అవినీతి రహిత పాలన బీజేపీతోనే సాధ్యమని చెప్పుకొచ్చారు. అన్ని పార్టీలకు చెందిన నేతలు బీజేపీలో చేరేందుకు సుముఖంగా ఉన్నారని కన్నా స్పష్టం చేశారు.

ఆట మొదలైంది..!

కాగా.. ఇప్పటి వరకూ ప్రతిపక్ష పార్టీనే అనుకుంటే ఇప్పుడు వైసీపీ నుంచి వలసలు మొదలవ్వడం గమనార్హం. వైసీపీలోని మరికొంత మంది అసంతృప్తులు.. టికెట్లు, పదవులు ఆశించి భంగపడ్డ వారంతా బీజేపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. మరోవైపు బీజేపీ నేతలు మాత్రం తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఆట మొదలైంది.. రాబోయే రోజుల్లో మేమే ప్రధాన ప్రతిపక్షంగా ఎదుగుతామని.. మరికొంత మంది కీలకనేతలు కాషాయ కండువాలు కప్పుకుంటారని చెబుతున్నారు. అయితే వైసీపీ నేతల జంపింగ్‌లపై పార్టీ పెద్దలు మాత్రం ఇంత వరకూ రియాక్ట్ అవ్వలేదు. మున్ముంథు ఎవరెవరు కండువాలు కప్పుకుంటారో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే మరి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.