close
Choose your channels

Unstoppable 2: వైఎస్ నా బెస్ట్ ఫ్రెండ్.. 'వెన్నుపోటు' ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే, చంద్రబాబు సమాధానమేంటీ.?

Wednesday, October 12, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

Unstoppable 2: వైఎస్ నా బెస్ట్ ఫ్రెండ్.. వెన్నుపోటు ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే, చంద్రబాబు సమాధానమేంటీ.?

నట సింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ‘ఆహా’లో ప్రసారమైన ‘అన్‌స్టాపబుల్’ సీజన్ వన్ ఎంత హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాలయ్య ఇంటర్వ్యూ చేసే విధానం, ఆయన అల్లరి, గెస్ట్‌లతో వ్యవహరించే తీరు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది. దీంతో ఈ ఒక్క షోతోనే ఆహా‌కు లక్షలాది మంది కొత్త సబ్‌స్క్రైబర్లు యాడ్ అయ్యారు. దీంతో అన్‌స్టాపబుల్ సీజన్‌ 2కి ప్లాన్ చేశారు నిర్వాహకులు. అయితే పార్ట్ 2 ఫస్ట్ ఎపిసోడ్‌కి ఎవరిని గెస్ట్‌గా పిలుద్దామా అని తలపట్టుకున్నారు. చిరంజీవి, పవన్ కల్యాణ్‌లను తీసుకురావాలని అనుకున్నారు. కానీ సాధ్యం కాలేదు. అయితే అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ.. తొలి ఎపిసోడ్‌కు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును ఒప్పించి తీసుకొచ్చారు అల్లు అరవింద్. ఇటీవలే ఈ ఎపిసోడ్ చిత్రీకరణ హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో జరిగింది. దీనికి సంబంధించిన ప్రోమోను ఈరోజు రిలీజ్ చేశారు నిర్వాహకులు.

మీకు బాబుగారు, నాకు బావగారు:

బైక్‌పై స్టైలిష్‌గా ఎంట్రీ ఇచ్చిన బాలకృష్ణ.. ‘‘సదా నన్ను కోరుకునే మీ అభిమానం.. అన్‌స్టాపబుల్‌ను టాక్‌షోలకి అమ్మ మొగుడిని చేసింది అంటూ పంచ్ డైలాగ్ కొట్టడంతో ప్రోమో ప్రారంభమైంది. ఈ సారి మా బంధువును ముందుగా పిలుద్దామనుకున్నానని.. కానీ , ప్రజలందరి బంధువును పిలిస్తే బాగుంటుందనుకున్నా.. అందుకే మీకు బాబుగారు, నాకు బావగారు’’ అంటూ చంద్రబాబు నాయుడుని స్టేజ్ మీదకు ఆహ్వానించారు బాలయ్య.

Unstoppable 2: వైఎస్ నా బెస్ట్ ఫ్రెండ్.. వెన్నుపోటు ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే, చంద్రబాబు సమాధానమేంటీ.?

అమ్మాయి కనిపిస్తే సైలెన్సర్ తీసేసేవాణ్ణి:

పొలిటికల్ ఇంటర్వ్యూల మాదిరిగా కాకుండా చంద్రబాబు వ్యక్తిగత విషయాలు, ఆయన కుర్రాడిగా వున్నప్పుడు చేసిన అల్లరి పనుల గురించి బాలకృష్ణ ప్రశ్నలు అడిగారు. కాలేజ్ డేస్‌లో అమ్మాయిలు కనిపించగానే బైక్ సైలెన్సర్లు తీసేసి నడిపేవాళ్లమని టీడీపీ చీఫ్ గుర్తుచేసుకున్నారు. ఇక మీ బెస్ట్ ఫ్రెండ్ అన్న ప్రశ్నకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గురించి చంద్రబాబు చెప్పడం బాగుంది. అలాగే 1995లో టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన వ్యవహారంపైనా బాలయ్య ప్రశ్న అడగటం .. దీనికి చంద్రబాబు ఏదో సమాధానం ఇవ్వడం కనిపించింది.

Unstoppable 2: వైఎస్ నా బెస్ట్ ఫ్రెండ్.. వెన్నుపోటు ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే, చంద్రబాబు సమాధానమేంటీ.?

మంగళగిరిలో ఓటమిపై లోకేష్ ఏం చెప్పారంటే:

ఆ వెంటనే చంద్రబాబు తనయుడు, బాలకృష్ణ పెద్దల్లుడు నారా లోకేష్ వేదిక మీదకు వచ్చారు. ఆయనను గత ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో మంగళగిరిలో ఓటమి గురించి ప్రశ్నించారు బాలయ్య. దీనికి లోకేష్ ఏం సమాధానం చెప్పారన్నది ఫుల్ ఎపిసోడ్‌లోనే చూడాలి. తర్వాత మీ నాన్న ఎప్పుడూ ఇదే గెటప్‌లో వుంటారా అని ప్రశ్నించగా.. యూరప్‌కి వెళ్లినా, మాల్దీవులకి వెళ్లినా ఇదే డ్రెస్ వేసుకుంటారు అని చెప్పారు. అనంతరం హోస్ట్‌ సీట్‌లోకి వెళ్లిన నారా లోకేష్.. మీ ఇద్దరిలో కుకింగ్ ఎవరు చేస్తారు అని అడగ్గా తాను కేవలం సలహాలు మాత్రమే ఇస్తానని చెప్పారు బాలయ్య. చంద్రబాబు మాత్రం తానే వండుకోలేదని .. ఇక ఆవిడకి ఏం వండిపెడతానంటూ చిరు నవ్వుతో సమాధానం చెప్పారు. మొత్తం మీద చంద్రబాబు, నారా లోకేష్‌ల పర్సనల్, పొలిటికల్ లైఫ్‌ గురించిన వివరాలతో ముస్తాబైన ఈ ఎపిసోడ్ చూడాలంటే అక్టోబర్ 14 వరకు ఎదురుచూడాల్సిందే.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.