close
Choose your channels

అభిమాని కోరికకు వంటలక్క ఫిదా.. ఊహించని గిఫ్ట్‌తో సర్‌ప్రైజ్..

Saturday, September 19, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

అభిమాని కోరికకు వంటలక్క ఫిదా.. ఊహించని గిఫ్ట్‌తో సర్‌ప్రైజ్..

ఓ అభిమాని కోరికకు కార్తీకదీపం పేమ్ వంటలక్క(ప్రేమీ విశ్వనాథ్) ఫిదా అయ్యారు. అది కూడా వంటలక్కను ఏమీ కోరలేదు. తమ కుటుంబం సీరియల్‌ను మిస్ అవుతుందని ఆ అభిమాని పడిన తాపత్రయం ఆమెను ఆశ్చర్యానికి గురి చేసింది. అసలు విషయం ఏంటంటే.. ‘స్టార్ మా’లో కార్తీక దీపం సీరియల్ రాత్రి 7:30కు ప్రసారమవుతుంది. అదే సమయంలో శనివారం నుంచి ఐపీఎల్ ప్రారంభం కానుంది. దీంతో సీరియల్‌ని మిస్ అవుతామన్న భయంతో ఏకంగా ఐపీఎల్ సమయాన్ని మార్చాలంటూ ట్విట్టర్ వేదికగా.. సూర్యాపేటకు చెందిన శివ చరణ్ అనే వ్యక్తి గంగూలీకి, స్టార్ మాకు, చెన్నై ఐపీఎల్‌కు ట్వీట్ చేశాడు.

ఐపీఎల్ సమయాన్ని రాత్రి 8 గంటలకు మార్చాలని ట్విట్టర్ వేదికగా శివచరణ్ కోరాడు. తమ ఇంట్లో మరో టీవీ కూడా లేదని.. కాబట్టి ఐపీఎల్ సమయాన్ని మార్చి తద్వారా తమ ఇంట్లో గొడవలు రాకుండా చూడాలని ట్వీట్‌లో పేర్కొన్నాడు. శివ చరణ్‌ చేసిన ట్వీట్‌ని చూసిన స్టార్ మా.. ‘ఒక జెన్యూన్ రిక్వెస్ట్’ అని పేర్కొంది. విషయం తెలుసుకున్న ప్రేమీ.. ఊహించని గిఫ్ట్ పంపించడమే కాకుండా ఒక లెటర్ కూడా శివ చరణ్‌కు రాసింది.

‘‘మీ అభిమానానికి మాటలు రావడం లేదు. ‘కార్తీక దీపం’ సీరియల్ గురించి మీ మనవి నన్ను కదిలించింది. మీరు ట్విట్టర్‌లో చెప్పిన సమస్యకు పరిష్కారంగా మిమ్మల్ని ఆశ్చర్యపరిచే కానుక పంపుతున్నాను. మీ ఇంట్లో కార్తీక దీపం ఇక వెలుగుతూనే ఉంటుంది. మీ అభిమానం మా పట్ల ఇలాగే ఉండాలని కోరుతున్నాను. మాస్క్ లేకుండా బయటకు వెళ్లకండి. సోషల్ డిస్టెన్స్ పాటించండి’’ అని లెటర్‌లో పేర్కొంది. దాంతో పాటు 32 అంగుళాల టీవీని కూడా గిఫ్ట్‌గా పంపించింది. గిఫ్ట్, లేఖను చూసిన శివ చరణ్ ఫ్యామిలీ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.