close
Choose your channels

వ‌రుణ్ స్పోర్ట్స్ డ్రామాకి ముహుర్తం ఫిక్స్

Tuesday, October 8, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

వ‌రుణ్ స్పోర్ట్స్ డ్రామాకి ముహుర్తం ఫిక్స్

ఈ ఏడాది `ఎఫ్ 2`, `గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేశ్‌`తో రెండు వ‌రుస విజ‌యాల‌ను చూశాడు మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్‌. ఈ నేప‌థ్యంలో... వ‌రుణ్ నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. డెబ్యూ డైరెక్ట‌ర్ కిర‌ణ్ కొర్ర‌పాటి కాంబినేష‌న్‌లో త‌న త‌దుప‌రి చిత్రాన్ని చేయ‌బోతున్నాడు వ‌రుణ్‌. స్పోర్ట్స్ డ్రామాగా తెర‌కెక్క‌నున్న ఈ సినిమాలో వ‌రుణ్ బాక్స‌ర్‌గా న‌టించ‌బోతున్నాడు. ఇప్ప‌టికే ప్ర‌త్యేక శిక్ష‌ణ కూడా తీసుకున్నాడ‌ని స‌మాచారం. కాగా, ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్య‌క్ర‌మాల‌ను అక్టోబ‌ర్ 10న జ‌రిపి... 2020 ఆరంభంలో రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభిస్తార‌ని తెలిసింది.

అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో అల్లు బాబీ, సిద్ధు ముద్దా సంయుక్తంగా నిర్మించ‌నున్న ఈ సినిమాకి యువ సంగీత సంచ‌ల‌నం ఎస్‌.ఎస్‌. థ‌మ‌న్ బాణీలు అందించ‌నున్నాడు. జార్జ్ సి. విలియ‌మ్స్ ఛాయాగ్ర‌హ‌ణం అందించ‌నున్నాడు. త్వ‌ర‌లోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి సంబంధించిన పూర్తివివ‌రాలు అధికారికంగా వెల్ల‌డి కానున్నాయి.

ఇదిలా ఉంటే, `తొలిప్రేమ‌` ద‌ర్శ‌కుడు వెంకీ అట్లూరితోనూ వ‌రుణ్ మ‌రో సినిమా చేయ‌బోతున్నాడు. `దిల్‌` రాజు నిర్మాణంలో తెర‌కెక్కనున్న‌ ఈ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌... 2020 ద్వితీయార్ధంలో ప‌ట్టాలెక్కుతుంద‌ని సమాచారం. మ‌రి.. వరుస విజ‌యాల‌తో దూకుడు మీదున్న వ‌రుణ్‌.. రాబోయే చిత్రాల‌తోనూ ఆ ప‌రంప‌ర‌ని కొన‌సాగిస్తాడేమో చూడాలి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.