close
Choose your channels

రైస్ పుల్లింగ్ పేరుతో రూ.26 కోట్లకు ముంచేసిన జయచిత్ర కుమారుడు

Friday, March 19, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

రైస్ పుల్లింగ్ పేరుతో రూ.26 కోట్లకు ముంచేసిన జయచిత్ర కుమారుడు

సీనియర్ నటి జయచిత్ర కుమారుడు, యువ సంగీత దర్శకుడు అమ్రేష్ ఒక వ్యక్తిని రూ.26 కోట్లకు ముంచేశాడు. ‘బ్లఫ్ మాస్టర్’ సినిమాలో ఉన్న రైస్ పుల్లింగ్ ఎపిసోడ్‌ని ఆధారంగా చేసుకున్నాడో.. లేదంటే సొంత ఐడియానో కానీ అద్భుతమైన స్కెచ్ గీసి ఎదుటి వ్యక్తిని బోల్తా కొట్టించాడు. చెన్నైలోని వలసరవాక్కంకు చెందిన నెడుమారన్‌ అనే వ్యక్తిని కొన్ని మహిమలు కలిగిన అరుదైన మూలకం ఇరిడియం(రైస్‌ పుల్లింగ్‌) తన వద్ద ఉందని, దాన్ని బయట మార్కెట్‌లో అమ్మితే చాలా డబ్బులు వస్తాయని.. ఈ వస్తువుకు భారీ డిమాండ్ ఉందని కోట్ల లాభం గడించవచ్చని చెప్పి రూ.26 కోట్లకు మోసం చేశాడు.

తాను మోసపోయానన్న విషయం తెలుసుకున్న నెడుమారన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అమ్రేష్, అతని బృందం నకిలీ ఇరిడియం ఇచ్చి మోసం చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. అందులో భాగంగా అమ్రేష్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి, మంగళవారం అతన్ని అరెస్ట్‌ చేశారు. ఆ తర్వాత ఎగ్మూర్‌లోని సీబీసీఐడీ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆదేశాల మేరకు అమ్రేష్‌‌ను ఆ తర్వాత జైలుకు తరలించారు. దీనికి సంబంధించి చైన్నెై పోలీసులు మంగళవారం రాత్రి ఓ ప్రకటన కూడా విడుదల చేశారు.

అమ్రేష్ మోసానికి సంబంధించిన విషయం తెలుసుకుని కోలీవుడ్ ఒక్కసారిగా షాక్ అయింది. ఈ కేసును చెన్నై క్రైమ్ బ్రాంచ్ అధికారులు విచారణ నిర్వహిస్తున్నారు. ఇక అమ్రేష్ సినిమాల విషయానికి వస్తే.. ప్రభు దేవా చార్లీ చాప్లిన్ 2‌కు సంగీతాన్ని అందించాడు. ఈ సినిమాలో చిన్న మచ్చన్ పాట సూపర్ హిట్ అయ్యింది. అతను మోటా శివ కెట్ట శివ, భాస్కర్ ఓరు రాస్కల్ వంటి సినిమాలకు సంగీతాన్ని అందించాడు. అంతేకాదు అమ్రేష్ నానే ఎన్నూల్ ఇల్లాయ్ అనే చిత్రంలో కూడా నటించాడు. ఇక ఆయన తల్లి జయచిత్ర తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు. ఎన్నో తెలుగు సినిమాల్లో నటించి మెప్పించారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.