close
Choose your channels

‘ఆచార్య’ సెట్‌లో వీడియో, ఫొటోలు లీక్‌..!

Thursday, February 25, 2021 • తెలుగు Comments

‘ఆచార్య’ సెట్‌లో వీడియో, ఫొటోలు లీక్‌..!

మెగాస్టార్ చిరంజీవి, కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం ‘ఆచార్య’. చిరంజీవి 152వ చిత్రమిది. ప్ర‌స్తుతం సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. రాజ‌మండ్రిలోని మారేడు మిల్లిలో చిరంజీవి, రామ్‌చ‌ర‌ణ్‌ల‌పై యాక్షన్ స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు. వీటికి సంబంధించిన ఫొటోలు నెట్టింట రెండు, మూడు రోజులుగా వైర‌ల్ అవుతున్నాయి. బుధ‌వారం రోజున ఆచార్య సెట్ నుంచి కొన్ని ఫొటోలు లీక్ అయ్యాయి. అందులో చిరంజీవి, చ‌ర‌ణ్ ఇద్ద‌రూ ఉన్నారు. మెగా ట్రీట్‌ను ఓ రేంజ్‌లో అందించ‌డానికి ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ త‌న వంతుగా గొప్ప ప్ర‌య‌త్నం చేస్తున్నాడ‌ని అంద‌రూ అనుకుంటున్నారు. అయితే ఈ ఫొటోలు ఎలా లీక్ అవుతున్నాయనేది మిలియన్ డాలర్స్ ప్రశ్నగా మారింది. కొరటాల శివ అండ్ టీమ్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం లేదా? అనే ప్రశ్నలు వస్తున్నాయి.

ఈ చిత్రాన్ని శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై నిరంజన్‌ రెడ్డి, రామ్‌చరణ్‌ నిర్మిస్తున్నారు. కాజల్‌ అగర్వాల్‌ మరోసారి మెగాస్టార్‌ సరసన నటిస్తోంది. రామ్‌చ‌ర‌ణ్ జోడీగా పూజా హెగ్డే క‌నిపించ‌నుంది. మే 13న ఈ ప్రెస్టీజియ‌స్ మూవీ భారీ విడుద‌ల కానుంది. రీసెంట్‌గా విడుద‌లైన ఈ సినిమా టీజ‌ర్‌కు అమేజింగ్ రెస్పాన్స్ వ‌చ్చింది.

Get Breaking News Alerts From IndiaGlitz