close
Choose your channels

'డియ‌ర్ కామ్రేడ్' ట్రైల‌ర్ డేట్ ఎప్పుడంటే?

Tuesday, July 9, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

డియ‌ర్ కామ్రేడ్ ట్రైల‌ర్ డేట్ ఎప్పుడంటే?

టాలీవుడ్‌లో ప్ర‌స్తుతం సెన్సేష‌న‌ల్ హీరో అనే క్రేజ్‌ను సొంతం చేసుకున్నాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. `పెళ్ళిచూపులు`తో హీరోగా తొలి స‌క్సెస్ సాధించిన ఈ యువ హీరో, త‌దుప‌రి చిత్రం `అర్జున్ రెడ్డి `తో స్టార్ హీరో రేంజ్‌కి ఎదిగాడు.అలాగే నెక్ట్స్ మూవీ `గీత గోవిందం`తో రూ.100 క్ల‌బ్‌లో చేరాడు. అదే ఊపులో ఆన్ లైన్‌లో లీకైనప్ప‌టికీ `టాక్సీవాలా`తో మంచి విజ‌యాన్ని ద‌క్కించుకున్నాడు. ఇప్పుడు అంద‌రి కళ్లు విజ‌య్ న‌టిస్తున్న తాజా చిత్రం `డియ‌ర్ కామ్రేడ్‌`పైనే ఉంది.

ఈ సినిమా ట్రైల‌ర్‌ను జూలై 11న 11గంట‌ల 11 నిమిషాల‌కు విడుద‌ల చేయ‌బోతున్నార‌ట‌. అలాగే సినిమా జూలై 26న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. కేవ‌లం తెలుగులోనే కాకుండా త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ భాష‌ల్లోనూ సినిమా విడుద‌ల‌వుతుంది. కాబ‌ట్టి విజ‌య్ దేవ‌ర‌కొండ ఈ సినిమాపై భారీ ఆశ‌ల‌నే పెట్టుకున్నాడు. ట్రేడ్ వ‌ర్గాలు కూడా ఈ సినిమా కోసం ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నాయి. భ‌ర‌త్ క‌మ్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.