close
Choose your channels

విజ‌య్ దేవ‌ర‌కొండ వెర్స‌స్ విజ‌య్ ఆంటోని

Monday, April 30, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

విజ‌య్ దేవ‌ర‌కొండ వెర్స‌స్ విజ‌య్ ఆంటోని

ఈ వేసవిలో ఒకే రోజున త‌మ కొత్త చిత్రాల‌తో ఇద్దరు విజయ్‌లు పోటీకి దిగుతున్నారు. వారిలో విజయాల బాటలో ఉన్న హీరో ఒకరైతే.. ఎలాగైనా విజయాన్ని అందుకోవాలనుకుంటున్న‌ హీరో ఇంకొకరు. వారే విజయ్ దేవరకొండ, విజయ్ ఆంటోనీ.

కాస్త ఆ వివరాల్లోకి వెళితే.. యూత్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా, నూతన దర్శకుడు రాహుల్ సాంకృత్య‌న్‌ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ 'టాక్సీవాలా'. ఇందులో ప్రియాంక జవల్కర్, మాళవికా నాయర్ నాయికలుగా నటించారు. 'అర్జున్ రెడ్డి' తర్వాత విజయ్ నటించిన చిత్రం కాబట్టి ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. జిఏ2 పిక్చర్స్, యువి క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం మే 18న ప్రేక్షకుల ముందుకు రానుంది.

కాగా.. ఇదే రోజు విజయ్ ఆంటోనీ, అంజలి, సునయన నాయకానాయికలుగా నటించిన తమిళ అనువాద చిత్రం ‘కాశి’ కూడా విడుదల కానుంది. 'బిచ్చగాడు'తో తెలుగు ప్రేక్షకులకి దగ్గరైన ఈ తమిళ హీరో.. ఆ తర్వాత వరుస ఫ్లాపులతో బాగా వెనుకబడి పోయాడు. ఈ సినిమాతోనైనా విజయాన్ని సాధించి మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కాలని ఉవ్విళ్లూరుతున్నాడు విజయ్ ఆంటోనీ.

ఇదిలా ఉంటే.. మహానటి సావిత్రి బయోపిక్‌గా తెరకెక్కిన 'మహానటి'లో విజయ్ దేవరకొండ ఫోటోగ్రాఫర్‌గా కనిపించనున్న విషయం తెలిసిందే. ఆసక్తికరమైన విషయమేమిటంటే.. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ పోషిస్తున్న పాత్ర పేరు విజయ్ ఆంటోనీ కావడం. త‌న పాత్ర పేరు గ‌ల న‌టుడితోనే  విజయ్ దేవరకొండ పోటీ ప‌డ‌నుండ‌డం ఆస‌క్తిక‌ర‌మైన విష‌యంగా చెప్పుకోవ‌చ్చు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.