close
Choose your channels

ముఖ్యమంత్రిని కలిసిన విలక్షణ నటుడు.. రూ.25 లక్షల విరాళం!

Tuesday, June 15, 2021 • తెలుగు Comments

విజయ్ సేతుపతి సౌత్ లో విలక్షణ నటనకు మారుపేరుగా మారిపోయారు. వెండితెరపై విజయ్ సేతుపతి ఆల్ రౌండర్. హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎలాంటి పాత్రలో అయినా ఒదిగిపోయి నటిస్తాడు విజయ్ సేతుపతి. వివాదాలకు దూరంగా ఉంటూ తన పని తాను చేసుకుపోతాడు.

ఇదీ చదవండి: స్నేహానికి విలువిచ్చే అరుదైన వ్యక్తి.. స్టార్ డైరెక్టర్ కు ఎన్టీఆర్ బర్త్ డే విషెస్!

అవసరమైనప్పుడు సహాయ కార్యక్రమాలు చేయడంలో విజయ్ సేతుపతి ముందుంటారు. తాజాగా విజయ్ సేతుపతి తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె స్టాలిన్ ని విజయ్ సేతుపతి కలిశారు. సెక్రటేరియట్ లో ఆయన కార్యాలయంలో స్టాలిన్ ని విజయ్ మీట్ అయ్యారు.

ఈ సందర్భంగా కోవిడ్ బాధితుల్ని ఆదుకునేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధికి విజయ్ రూ. 25 లక్షల విరాళం అందించారు. 25 లక్షల చెక్ ని విజయ్ సేతుపతి.. స్టాలిన్ కి అందించారు.

స్టాలిన్ తమిళనాడు సీఎంగా పగ్గాలు చేపట్టాక ప్రముఖ నటీనటులందరూ ఆయన్ని కలుస్తున్న సంగతి తెలిసిందే. రజనీకాంత్, కమల్ హాసన్ ఇప్పటికే స్టాలిన్ ని కలిశారు.

గత ఏడాది విజయ్ సేతుపతి 'ఉప్పెన' చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. హీరోయిన్ తండ్రిగా, విలన్ గా విజయ్ అద్భుతంగా నటించాడు. సౌత్ లో విజయ్ సేతుపతి మోస్ట్ వాంటెడ్ యాక్టర్. ప్రస్తుతం విజయ్ చేతుల్లో డజను పైగా చిత్రాలు ఉన్నాయంటే ఆయన క్రేజ్ అర్థం చేసుకోవచ్చు.

Get Breaking News Alerts From IndiaGlitz