close
Choose your channels

విక్రమ్ మూవీ తెలుగు టీజర్ రెడీ..

Thursday, June 30, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

త‌మిళ హీరో విక్ర‌మ్ న‌టిస్తున్న తాజా చిత్రం ఇరు ముగ‌న్. ఈ చిత్రాన్ని ఆనంద్ శంక‌ర్ తెర‌కెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో విక్ర‌మ్ స‌ర‌స‌న న‌య‌న‌తార‌, నిత్యామీన‌న్ న‌టిస్తున్నారు. ఈ చిత్రంలో న‌టించిన విక్ర‌మ్, న‌య‌న‌తార‌, నిత్యామీన‌న్ ల‌కు తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉండ‌డంతో ఈ మూవీ పై తెలుగులో కూడా మంచి క్రేజ్ తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.

అందులో భాగంగానే ఈ మూవీ తెలుగు టీజ‌ర్ ను సింగ‌పూర్ లో జ‌రుగుతున్న సైమా వేడుక‌ల్లో రిలీజ్ చేయ‌నున్నారు. తెలుగు టీజ‌ర్ తో పాటు ఈ మూవీ తెలుగు టైటిల్ కూడా ఎనౌన్స్ చేస్తార‌ట‌. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని సెప్టెంబ‌ర్ 5న తెలుగు, త‌మిళ్ లో ఒకేసారి రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. శంక‌ర్ ఐ సినిమాతో ఆశించిన విజ‌యాన్ని అందుకోలేక‌పోయిన విక్ర‌మ్ ఈసారి స‌రైన స‌క్సెస్ సాధిస్తాడో లేదో చూడాలి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.