close
Choose your channels

పోలీస్ ఆఫీసర్ పాత్ర పవర్ ఫుల్ గా ఉంటుంది - విశాల్

Tuesday, August 18, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

పందెం కోడి, పొగరు, భరణి, పూజ, మగమహారాజు వంటి సూపర్‌హిట్‌ చిత్రాలతో తొగు ప్రేక్షకులను అలరించిన యంగ్‌ హీరో విశాల్‌ కథానాయకుడిగా జవ్వాజి రామాంజనేయులు సమర్పణలో సర్వంత్‌ రామ్‌ క్రియేషన్స్‌, సాయిచంద్ర ఫిలింస్‌ బ్యానర్స్ పై సుశీంద్రన్‌ దర్శకత్వంలో జి.నాగేశ్వరరెడ్డి, ఎస్‌.నరసింహ ప్రసాద్‌ నిర్మిస్తున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ జయసూర్య`. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని సెప్టెంబర్‌ 4న విడుదలవుతోంది.

ఈ సందర్భంగా హీరో విశాల్‌ మాట్లాడుతూ నా కెరీర్‌లో జయసూర్య` మరో సూపర్‌హిట్‌ సినిమా అవుతుంది. పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా ఒక డిఫరెంట్‌ క్యారెక్టరైజేషన్‌తో రూపొందుతున్న సినిమా ఇది. మాస్‌ ఎలిమెంట్స్‌తో, అన్ని కమర్షియల్‌ హంగులు వున్న ఈ సినిమా తప్పకుండా ప్రతి ఒక్కరినీఎంటర్‌టైన్‌ చేస్తుంది`` అన్నారు.

చిత్ర సమర్పకుడు జవ్వాజి రామాంజనేయులు మాట్లాడుతూ ` హీరో విశాల్‌కు తెలుగులో చాలా మంచి ఫాలోయింగ్‌ వుంది. అతను చేసిన సినిమాలు కుటుంబ సమేతంగా చూసేవిగా వుంటాయి. అలాగే మాస్‌ ఆడియన్స్ ని కూడా ఆకట్టుకుంటాయి. ఈ చిత్రంలో పోలీస్‌ ఆఫీసర్‌ క్యారెక్టర్‌లో విశాల్‌ పెర్‌ఫార్మెన్స్‌ చాలా హైలైట్‌గా వుంటుంది. ప్రతి ఒక్కరూ ఎంజాయ్‌చేసేలా ఈ సినిమా వుంటుంది.

ఆగస్ట్‌ 22న ఆడియో, సెప్టెంబర్‌ 4న సినిమా విడుదల

నిర్మాతలు జి.నాగేశ్వరరెడ్డి, ఎస్‌.నరసింహప్రసాద్‌ మాట్లాడుతూ ` మాస్‌ హీరో విశాల్‌ నటించిన గత చిత్రాలన్నీ అన్నివర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. జయసూర్య`లో పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ క్యారెక్టర్‌తో మరోసారి ఆడియన్స్ ని ఆకట్టుకుంటారు. ఈ చిత్రానికి డి.ఇమ్మాన్‌ అందించిన మ్యూజిక్‌ ఎక్స్ లెంట్‌గా వుంటుంది. పాటలన్నీ చాలా అద్భుతంగా చేశారు. ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ ఆగస్ట్‌ 22న హైదరాబాద్‌లోని జె.ఆర్‌.సి. కన్వెన్షన్‌ సెంటర్‌లో చాలా గ్రాండ్‌గా రిలీజ్‌ చెయ్యబోతున్నాం. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి సెప్టెంబర్‌ 4న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం`` అన్నారు.

విశాల్‌, కాజల్‌ అగర్వాల్‌ హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ చిత్రంలో సూర్య(కమెడియన్‌), జయప్రకాష్‌, హరీష్‌ ఉత్తమ్‌, సముద్ర ఖని, ఐశ్వర్య దత్‌, మురళీశర్మ తదితరులు ఇతర తారాగణం. ఈ చిత్రానికి మాటలు: శశాంక్‌ వెన్నెలకంటి, కెమెరా: వేల్‌రాజ్‌, సంగీతం: డి.ఇమ్మాన్‌, ఎడిటర్‌: ఆంటోని, నిర్మాతలు: జి.నాగేశ్వరరెడ్డి, ఎస్‌.నరసింహ ప్రసాద్‌, దర్శకత్వం: సుశీంద్రన్‌.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.