close
Choose your channels

వైజాగ్ లో స‌రైనోడు ఫంక్ష‌న్ డేట్ ఫిక్స్..

Friday, March 25, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం స‌రైనోడు. సూపర్ డూపర్ హిట్స్ ని అందించిన ప్రతిష్టాత్మక గీతా ఆర్ట్స్ బ్యానర్లో అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న స‌రైనోడు సాంగ్స్ ను ఏప్రిల్ 1న నేరుగా మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు నిర్మాత అల్లు అర‌వింద్ ప్రకటించారు. ఏప్రిల్ రెండో వారంలో విశాఖపట్నంలో గ్రాండ్ గా ఫంక్షన్ ను చేయనున్న‌ట్టు గ‌తంలో ప్ర‌క‌టించారు.

అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం ఏప్రిల్ 10న విశాఖ‌పట్నంలో ఆడియో స‌క్సెస్ మీట్ గ్రాండ్ నిర్వ‌హించేందుకు నిర్ణ‌యించారు. యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో బ‌న్ని స‌ర‌స‌న ర‌కుల్ ప్రీత్ సింగ్, కేథ‌రిన్ న‌టిస్తున్నారు. ఈ చిత్రంలో అంజ‌లి స్పెష‌ల్ సాంగ్ చేయ‌డం విశేషం. భారీ అంచ‌నాలు ఏర్ప‌రుచుకున్న స‌రైనోడు సినిమాని ఏప్రిల్ 22న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ చేయ‌నున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.