close
Choose your channels

సునీల్ క్రిష్ణాష్ట‌మి రిలీజ్ ఎప్పుడు..?

Saturday, October 3, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

అందాల రాముడు, పూల రంగ‌డు,మిస్ట‌ర్ పెళ్లికొడుకు, భీమ‌వ‌రం బుల్లోడు...ఇలా వైవిధ్య‌మైన చిత్రాల‌తో అల‌రించిన క‌మెడియ‌న్ ట‌ర్న‌డ్ హీరో సునీల్. కొంత గ్యాప్ త‌రువాత సునీల్ హీరోగా న‌టించిన చిత్రం క్రిష్ణాష్ట‌మి. ఈ చిత్రాన్ని జోష్ ఫేం వాసు వ‌ర్మ తెర‌కెక్కించారు. దిల్ రాజు ఈ మూవీని నిర్మించారు. ఈ చిత్రంలో సునీల్ స‌ర‌స‌న నిక్కీ గ‌ల్రాని, డింపుల్ న‌టించారు.

భీమ‌వ‌రం బుల్లోడు ఆశించిన స్ధాయిలో విజ‌యం సాధించ‌క‌పోవ‌డంతో... సునీల్ ఈసారి ఎలాగైనా స‌రే హిట్ సాధించాల‌ని ఈ సినిమా చేసారు. అలాగే జోష్ చిత్రంతో స‌క్సెస్ సాధించ‌లేక‌పోయిన డైరెక్ట‌ర్ వాసు వ‌ర్మ కూడా ద్వితీయ ప్ర‌య‌త్నంలో ఖ‌చ్చితంగా స‌క్సెస్ సాధించాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఈ మూవీని తెర‌కెక్కించారు. న‌వంబ‌ర్ రెండో వారంలో క్రిష్ణాష్ట‌మి చిత్రాన్ని రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. మ‌రి..విజ‌యం కోసం త‌పిస్తున్న సునీల్, వాసు వ‌ర్మ‌ల ప్ర‌య‌త్నం ఫ‌లిస్తుందో..? లేదో..?

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.