శిరీష్‌కు అంత నమ్మకమేంటో..?
Send us your feedback to audioarticles@vaarta.com
అల్లు శిరీష్ 'గౌరవం' సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. 'కొత్తజంట', 'శ్రీరస్థు శుభమస్తు', 'ఒక్కక్షణం' సినిమాలు కాస్త మంచి పేరునే తెచ్చిపెట్టాయి. తాజాగా విడుదలైన ఏబీసీడీ`పై శిరీష్ చాలా ఆశలే పెట్టుకున్నా.. ఫలితం లేకుండా పోయింది. మంచి బ్రేక్ మాత్రం దొరకలేదు. అయితే ఈసారి ఈ కుర్ర హీరో తదుపరి సినిమాకు ఎక్కువ గ్యాప్ తీసుకోవాలనుకోవడం లేదట.
ప్రేమ్‌సాయి దర్శకత్వంలో గీతాఆర్ట్స్ బ్యానర్లో ఓ సినిమా చేయాలనుకుంటున్నాడు. అయితే ఇది వరకు ప్రేమ్‌సాయి .. నితిన్‌తో కొరియర్ బాయ్ కల్యాణ్ సినిమా చేశాడు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేదు. అయితే సరైన బ్రేక్ కోసం చూస్తున్న శిరీష్‌కి ఎంత నమ్మకముందో ఏమో కానీ ప్రేమ్‌సాయికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని టాక్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.