close
Choose your channels

పాల్ వార్నింగ్‌కు కేటీఆర్ రియాక్ట్ అవుతారా..!?

Tuesday, May 7, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ క్రైస్తవ మతబోధకుడు కేఏ పాల్‌ గురించి ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు ఆయన రేంజ్‌ ఎలా ఉన్నదో చాలా వరకు తెలియదు కానీ ఇప్పుడు ఆయన రేంజ్‌ ఏంటో ఈ యూత్‌కు బాగా తెలిసింది. ఆయన ప్రెస్‌మీట్‌లో ఏం మాట్లాడుతారో..? అసలు ఏం మాట్లాడదామని మీడియా ముందుకు వస్తారో..? ఎవరికీ అర్థం కాదు.. కొన్ని కొన్నిసార్లు పాల్ కాస్త.. ‘నవ్వు పాల్’ కూడా అవుతుంటారు.. కొందరైతే అచ్చంగా నవ్వుకునేందుకు ఈయన ప్రెస్‌మీట్ చూస్తుంటారు. ఇక మిగిలిన విషయాలన్నీ ఆ పెరుమాళ్లకే ఎరుక. అలా మునుపెన్నప్పుడూ లేని క్రేజ్‌ని ఎన్నికల సీజన్‌లో పాల్ సంపాదించుకున్నారని చెప్పుకోవచ్చు.

పాల్ ఎందుకింత రెచ్చగొట్టారు..!?

ఎన్నికల తర్వాత మీడియా మీట్‌లకు గ్యాప్ ఇచ్చిన పాల్.. మంగళవారం నాడు మీడియా ముందుకొచ్చి టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ కుటుంబంపై ఘాటు విమర్శలు గుప్పించారు. అంతేకాదు ఏకంగా కేసీఆర్, కేటీఆర్‌లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి.. తనతో పెట్టుకుంటే ఖబడ్డార్ అంటూ రెచ్చగొట్టే మాటలు మాట్లాడారు. ప్రపంచాన్ని జయించిన పాల్‌తో పెట్టుకోవద్దని.. తానేం మందా కృష్ణ మాదిగను కాదంటూ రెచ్చిపోయారు. 2008లో కేసీఆర్ తన దగ్గరకు వస్తే ఆశీర్వదించానని.. అంతేకాదు ఫస్ట్ తానే తెలంగాణకు మద్దతు ఇచ్చి కేసీఆర్‌కు ఫండ్ కూడా ఇచ్చానన్నారు. తెలంగాణలో విద్యార్థుల మరణాల గురించి మాట్లాడిన ఆయన.. కవిత, కేటీఆర్ ఆత్మహత్య చేసుకుంటే కేసీఆర్ నిద్రపోతారా?. కేటీఆర్‌ను చినజీయర్ స్వామి.. కేసీఆర్‌ను పూజారులు ఎవరూ కాపాడలేరన్నారు.

ఆశ్చర్యపోయిన జనాలు..

అయితే ఈ మాటలు విన్న తెలుగు రాష్ట్రాల ప్రజలు ఒకింత ఆశ్చర్యానికి లోనయ్యారు. పాల్ తనతో పెట్టుకోవద్దంటున్నారు సరే.. అసలు పాల్‌తో పెట్టుకుంటామని ఎవరు చెప్పారు..? కేసీఆర్ చెప్పారా..? కేటీఆర్ చెప్పారా..? అసలు టీఆర్ఎస్ నేతలు ఎప్పుడైనా పాల్ గురించి మాట్లాడిన దాఖలాలున్నాయా..? అసలు ఎందుకిలా పాల్ నవ్వులపాలయ్యే మాటలు మాట్లాడారో అర్థం గాక కొందరు జుట్టుపీక్కున్నారు. ఆయన ఎందుకిలా మాట్లాడారో ఎదుటోళ్లకు అర్థంగాక పోయినా.. కనీసం పాల్‌కు అయినా క్లారిటీ ఉందో లేదో ఆ దేవుడికెరుక అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

కేటీఆర్ రియాక్ట్ అవుతారా..?

తనపై, తన పార్టీపై విమర్శలు చేసే వారిపై ప్రతివిమర్శలు చేస్తూ స్ట్రాంగ్ కౌంటర్లిచ్చే తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. పాల్ వ్యాఖ్యలకు రియాక్ట్ అవుతారా..? లేకుంటే లైట్ తీసుకుంటారా..? లేకుంటే పాల్ గురించి మాట్లాడి ఆయన్ను హీరో చేయమెందుకనీ సైలెంట్ అవుతారా..? అన్నది ఇప్పుడు తెలంగాణలో చర్చనీయాంశమైంది. కాగా.. ఏపీ ఎన్నికల సీజన్ మొదలుకుని నేటి వరకూ తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై పాల్ చేయని విమర్శ లేదనే చెప్పుకోవాలి.. అటు టీడీపీపై ఇటు వైసీపీపై వార్తల్లో రాయలేని రీతిలో విమర్శలు గుప్పించారాయన. అయితే ఇరు పార్టీల నేతలు తెలివిగా పాల్‌ను పట్టించుకోవడమే మానేశారు. అయితే తెలంగాణపై పడ్డ పాల్ కేసీఆర్ ఫ్యామిలీపై ఘాటు విమర్శలు చేశారు. ఈ వ్యాఖ్యలపై కేటీఆర్, కవిత, కేసీఆర్ ముఖ్యంగా పార్టీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే మరి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.