సూర్య సినిమా మళ్లీ వెనక్కి వెళ్లనుందా?
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు, తమిళంలో హీరోగా మంచి గుర్తింపుతో పాటు తన సినిమాలకు మంచి మార్కెట్‌ను క్రియేట్ చేసుకున్న వాళ్లలో సూర్య ఒకడు. ఈయనకున్న క్రేజ్ కారణంగా ఆయన నటించిన సినిమాలు రెండు భాషల్లోనూ సమాంతరంగా విడుదలవుతుంటాయి. ఇప్పుడూ అలాగే సూర్య నటించిన `ఎన్.జి.కె(నందగోపాలకృష్ణ)` కూడా తెలుగులో విడుదల కానుంది. రీసెంట్గా ఈ సినిమా టీజర్ కూడా విడుదలైంది.
టీజర్ చూస్తుంటే సినిమా పొలిటికల్ థ్రిల్లర్ అని అర్థమవుతుంది. ఈ సినిమాను తమిళ సంవత్సరాది సందర్భంగా ఏప్రిల్ 14న విడుదల చేస్తారనే వార్తలు వినిపించాయి. అయితే లెటెస్ట్ న్యూస్ ప్రకారం ఈ సినిమాను మే నెలలో విడుదల చేసేలా ప్లాన్ చేసుకుంటున్నారట. ఏప్రిల్‌లో జరగబోయే ఎన్నికలు కూడా సినిమా వెనక్కి వెళ్లడానికి ఓ కారణంగా కనపడుతున్నాయి. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్లో రూపొందుతోన్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్, సాయిపల్లవి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.