close
Choose your channels

పోసాని రియల్ కోరికను వైఎస్ జగన్ నెరవేరుస్తారా!?

Sunday, July 14, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

పోసాని రియల్ కోరికను వైఎస్ జగన్ నెరవేరుస్తారా!?

టాలీవుడ్ నటుడు కమ్ రచయిత పోసాని కృష్ణ మురళీ వైసీపీకి ఏ రేంజ్‌లో మద్దతిచ్చారో..? ఏ విధంగా టీడీపీని, జగన్‌కు సపోర్ట్ చేయని మీడియా సంస్థలను టార్గెట్ చేస్తూ మాట్లాడారో కొత్తగా చెప్పనక్కర్లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్‌ను పచ్చి పచ్చిగా తిట్టేశారు కూడా.!. అయితే పోసాని అనుకున్నట్లుగానే.. వైసీపీ అధికారంలోకి రానే వచ్చింది. మరి ఇన్ని రోజులు పార్టీ కోసం కష్టపడిన పోసానికి జగన్ ఏం హోదా కల్పించబోతున్నారు..? ఇంతకీ పోసాని అనే వ్యక్తి వైసీపీ అధినేతకు గుర్తున్నారా..? అసలు ఈయన్ను సీఎం పట్టించుకోరా..? లేదా..? అన్నది పోసాని కుటుంబ సభ్యుల్లో మెదులుతున్న ఏకైక ప్రశ్న.

అందరికీ పదవులొస్తున్నాయ్!

వైఎస్ జగన్ పాదయాత్ర మొదలుకుని.. ఆయన అధికారంలోకి వచ్చేంత వరకు తన వంతుగా పోసాని ప్రయత్నాలు చేశారన్నది ఎవరు ఒప్పుకున్నా.. ఒప్పుకోకపోయినా జగమెరిగిన సత్యం. అయితే టాలీవుడ్ తరఫున చాలా వరకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ సమక్షంలో కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే. ఇందులో ముఖ్యమైన వారు.. థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ, కమెడియన్ అలీ, పోసాని, జయసుధ, మోహన్ బాబు‌తో ఒకరిద్దరు ఉన్నారు. అయితే వీరిలో ఒక్కొక్కరుగా పదవుల్లో సెటిల్ అయిపోతున్నారు. ఇప్పటికే పృథ్వీకి ఎస్వీబీసీ భక్తి చానెల్‌కు చైర్మెన్‌గా నియమించడం జరిగింది. మరోవైపు అలీకి సైతం త్వరలోనే ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టబోతున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం.

రియల్‌ లైఫ్‌లో చాన్స్ వచ్చేనా!?

ఇక మిగిలిందల్లా.. మోహన్ బాబు‌, జయసుధ వీరిలో కూడా ఒకర్ని ఆంధ్రప్రదేశ్‌ సినిమా, టీవీ, నాటక రంగ అభివృద్ధి సంస్థ(ఎఫ్‌డీసీ) చైర్మన్‌ పదవి వరించబోతోందని సమాచారం. సో.. ఇక మిగిలిందల్లా పోసానీ మాత్రమే. అయితే తాను రీల్‌ (సినిమాల్లో) రాజకీయ నాయకుడిగా నటించి.. నటించి ఒక్కసారైనా రియల్‌గా ప్రజాప్రతినిధి కావాలన్నది పోసాని కోరికట. ఇందులో భాగంగా తన చిరు కోరికను వైసీపీ కీలక నేత చెప్పగా.. ఆయన వైఎస్ జగన్ చెవిన పడేశారట. అయితే ఇంతవరకూ జగన్ నుంచి ఎలాంటి రిప్లై లేదట. అంతేకాదు.. రియల్‌ లైఫ్‌‌లో ఒకే ఒక్క చాన్స్ ఇవ్వండని వైసీపీ అధినేత జగన్‌‌ను త్వరలోనే పోసాని కలుస్తారని సమాచారం. ఫైనల్‌గా పోసానికి ఏమైనా పదవి ఉంటుందా..? ఉండాదా..? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.