close
Choose your channels

దేశంలోనే యంగెస్ట్ ఐపీఎస్ ఆఫీసర్.. మహేష్ బాబుకు ఫిదా!

Tuesday, June 8, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

దేశంలోనే యంగెస్ట్ ఐపీఎస్ ఆఫీసర్.. మహేష్ బాబుకు ఫిదా!

కోట్లాదిమంది అభిమానించే నటుడు సూపర్ స్టార్ మహేష్ బాబు. ప్రత్యేకమైన నటన, ఆకర్షించే ఆరడుగుల రూపం మహేష్ బాబు సొంతం. ఎలాంటి పాత్ర అయినా తనదైన శైలిలో ప్రాణం పెట్టి చేస్తాడు మహేష్. అలాంటి మహేష్ కు దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఇందులో ఎలాంటి ఆశ్చర్యం అవసరం లేదు.

ఇదీ చదవండి: ఒక్క అభిమాని దూరమైనా భరించలేను.. బాలకృష్ణ ఎమోషనల్ కామెంట్స్

అయితే దేశంలోనే యంగెస్ట్ ఐపీఎస్ అధికారిని కూడా మహేష్ ఆకర్షించాడు. గుజరాత్ కు చెందిన 22 ఏళ్ల సఫిన్ హాసన్ ఇండియాలో అత్యంత పిన్న వయస్కుడైన ఐపీఎస్ అధికారి. చిన్న తనం నుంచే ఆర్థిక ఇబ్బందులు, పేదరికంతో పెరిగిన సఫిన్ గుజరాత్ లోని ఓ మారుమూల గ్రామం నుంచి వచ్చాడు. అతడి స్టోరీ ప్రతి ఒక్కరికి ఆదర్శం.

అలాంటి సఫిన్ కూడా మహేష్ బాబుకు అభిమానిగా మారాడట. ఈ విషయాన్ని సఫిన్ సోషల్ మీడియాలో నెటిజన్లతో ముచ్చటిస్తున్న సందర్భంగా రివీల్ చేశాడు. సఫిన్ ఇంతవరకు మహేష్ సినిమాలే చూడలేదు. కానీ తన స్నేహితుల నుంచి మహేష్ గురించి అన్ని విషయాలు తెలుసుకున్నాడు. అప్పటి నుంచి తాను మహెష్ కు అభిమానిగా మారానని సఫిన్ తెలిపాడు.

నటుడిగానే కాకుండా మహేష్ చారిటి కార్యక్రమాలతో కూడా తన గొప్ప మనసు చాటుకుంటున్న సంగతి తెలిసిందే. మహేష్ బాబు ఇప్పటికే 1000 మంది చిన్నారులకు పైగా హార్ట్ ఆపరేషన్స్ చేయించాడు. అలాగే బుర్రిపాలెం గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాడు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.