close
Choose your channels

సోనూసూద్ కంటే వైఎస్ భారతి లక్ష రెట్లు బెటర్: పోసాని

Monday, September 7, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సోనూసూద్ కంటే వైఎస్ భారతి లక్ష రెట్లు బెటర్: పోసాని

కరోనా మహమ్మారి రీల్ లైఫ్ విలన్ కాస్తా.. రియల్ లైఫ్ హీరోని చేసింది. వలస కూలీలను తమ గమ్య స్థానానికి చేర్చడం మొదలు ఆయన చేసిన సేవలు దేశ ప్రజల దృష్టిలో రియల్ లైఫ్ హీరోని చేశాయి. అప్పటి నుంచి ఆయన క్రేజ్ పెరుగుతూనే ఉంది. ఎంతో మంది ఆయన సాయం పొందిన వాళ్లు.. ఆయననొక దేవుడిలా చూస్తున్నారు. ఒకరు తమ కుమారుడికి సోనూ పేరు పెట్టుకుంటే.. మరొకరు తమ షాపునకు సోనూ పేరు పెట్టుకుని ఆయనపై అభిమానాన్ని చాటుకున్నారు. దేశ విదేశాల్లో ఉన్నవారెవరైనా సరే సాయం అంటే కచ్చితంగా సోనూ సూద్ చేసి తీరుతాడన్న నమ్మకం ఉంది. ఆయన సాయం పొందిన వారు పరతి రాష్ట్రంలోనూ ఉన్నారంటే అతిశయోక్తి కాదు.

ఇలాంటి సోనూసూద్‌పై టాలీవుడ్ డైరెక్టర్ పోసాని కృష్ణ మురళి బహిరంగ విమర్శలు చేశారు. సోనూ కంటే వైఎస్ జగన్ సతీమణి భారతీరెడ్డి లక్ష రెట్లు బెటరంటూ తన స్వామిభక్తిని ప్రదర్శించే ప్రయత్నం చేశారు. ఓ ప్రముఖ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పోసాని తనదైన శైలిలో రెచ్చిపోయి సోనూపై విమర్శలు గుప్పించారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టకముందే ఆయనది ఇన్‌కమ్ ట్యాక్స్ ఫెయిడ్ ఫ్యామిలీ అన్నారు. తాను 15 రోజుల పాటు పులివెందులలో ఉండి, అక్కడి ప్రజలతో మాట్లాడానని వెల్లడించారు. పులివెందులలోని 10 ఎస్సీ, ఎస్టీ కాలనీలున్నాయ్. వారందరికీ వైఎస్ కుటుంబమే స్థలమిచ్చి, ఇళ్లు కట్టించిందని పోసాని వెల్లడించారు.

మరి ఇవన్నీ ఎవడికి తెలుసని పోసాని ప్రశ్నించారు. రాజారెడ్డిగారు ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డిగారు 5 లక్షల కళ్ల ఆపరేషన్లు చేయించారని తనకు తెలిసిందన్నారు. ఇప్పటికీ వికలాంగులు, మానసిక వికలాంగులకు వైఎస్ భారతీగారు సొంత డబ్బులతో స్కూల్స్ పెట్టించారు. వారి బాగోగులు మొత్తం జగన్, భారతీ గారే చూసుకుంటున్నారన్నారు. ఇవన్నీ ఎవడైనా చెప్పుకుంటారా..? అని ప్రశ్నించారు. సోనూసూద్ కంటే కంటే లక్ష రెట్లు వైఎస్ భారతీగారు బెస్ట్. ఆమె సేవ చేస్తున్నారు. కానీ ఇవన్నీ ఎవరికీ చెప్పరు.. చెప్పుకోరు కూడా అని పోసాని తెలిపారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.