close
Choose your channels

ప్ర‌కాష్ రాజ్ న్యూమూవీకి వెరైటీ టైటిల్

Monday, November 23, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

తెలుగు, త‌మిళ‌, కన్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో వైవిధ్య‌మైన చిత్రాల్లో న‌టించిన త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌త ఏర్ప‌రుచుకున్న విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాష్ రాజ్. న‌టుడుగానే కాకుండా నిర్మాత‌గా, ద‌ర్శ‌కుడిగా మంచి చిత్రాల‌ను అందించాడు. తాజాగా విభిన్న క‌థాంశంతో మ‌న ఊరి రామాయ‌ణం అనే టైటిల్ తో ఓ చిత్రాన్నితెర‌కెక్కించ‌డానికి ప్లాన్ చేస్తున్నాడు.

గ‌తంలోథోని, ఉల‌వ‌చారు బిర్యానీ చిత్రాల‌ను తెర‌కెక్కించిన ప్ర‌కాష్ రాజ్ ఈసారి డిఫ‌రెంట్ కాన్సెప్ట్ తో మ‌న ఊరి రామాయ‌ణం చూపిస్తానంటున్నాడు. ఈ చిత్రానికి ఇళ‌య‌రాజా సంగీతాన్ని అందిస్తున్నారు. ఇటీవ‌ల మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లాలోని కొండారెడ్డి ప‌ల్లి గ్రామాన్ని ద‌త్త‌త తీసుకున్న ప్ర‌కాష్ రాజ్ మ‌న ఊరి రామాయ‌ణం టైటిల్ తో సినిమా తెర‌కెక్కిస్తుండ‌డం విశేషం.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.