close
Choose your channels

సూపర్ స్టార్ తో హన్సిక....

Thursday, February 2, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మ‌ల‌యాళంతో పాటు ద‌క్షిణాది సినిమాల‌పై ఫుల్ ఫోక‌స్ పెట్టిన మ‌ల‌యాళ సూప‌ర్‌స్టార్ మోహ‌న్ లాల్ ఇప్పుడు హీరోగా ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను ఉన్నికృష్ణ‌న్ డైరెక్ట్ చేస్తున్నాడు. లింగ‌, భ‌జ‌రంగీ భాయ్‌జాన్ వంటి సినిమాను నిర్మించిన నిర్మాత రాక్‌లైన్ వెంకటేష్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో తెలుగువాడైన త‌మిళ హీరో విశాల్ ఓ కీల‌క‌పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడ‌ట‌.

అలాగే టాలీవుడ్‌కు చెందిన సీనియ‌ర్ హీరో శ్రీకాంత్ కూడా ఈ చిత్రంలో కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నాడు. కాగా ఈ సినిమాలో హీరోయిన్ హ‌న్సిక కూడా ఓ అతిథి పాత్ర‌లో మెర‌స్తుంద‌ట‌. ప్ర‌స్తుతం మేజ‌ర్ ర‌వి 1971, బియాండ్ ది బోర్డ‌ర్స్ సినిమా త‌ర్వాతే ఈ సినిమా సెట్స్‌లోకి వెళుతుంది. 30 కోట్ల‌కు పైగా భారీ బ‌డ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తార‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల టాక్‌. ఈ సినిమాతో శ్రీకాంత్‌, విశాల్‌, హ‌న్సిక‌లు మాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు మ‌రి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.