close
Choose your channels

మ‌రో ఆప‌రేష‌న్ దుర్యోధ‌న ఈ మెంట‌ల్ - బ‌షీద్

Tuesday, September 6, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

శ్రీకాంత్, అక్ష నాయ‌కానాయిక‌లుగా కరణం బాబ్జీ దర్శకత్వంలో తెరకెక్కించిన సినిమా మెంటల్`. ఈ సినిమాని ఎస్‌.కె.బ‌షీద్ స‌మ‌ర్ప‌ణ‌లో ఎస్‌.కె.క‌రీమున్నీసా నిర్మిస్తున్నారు. ఈనెల 9న దాదాపు 300 థియేట‌ర్ల‌లో ఈ సినిమా రిలీజ‌వుతోంది. ఈ సంద‌ర్భంగా హైద‌రాబాద్ రామానాయుడు స్టూడియోస్ థియేట‌ర్‌లో చిత్ర‌యూనిట్ మాట్లాడింది.

స‌మ‌ర్ప‌కుడు బ‌షీద్ మాట్లాడుతూ -``ఆప‌రేష‌న్ దుర్యోధ‌న‌, ఖ‌డ్గం సినిమాల త‌ర్వాత మ‌ళ్లీ ఆ రేంజు సినిమా ఇది. శ్రీ‌కాంత్ న‌ట‌న సినిమాకే హైలైట్‌. ఆప‌రేష‌న్ దుర్యోధ‌న‌లో ఎమోష‌న్స్‌ని మించిన ఎమోష‌న్స్ ఈ చిత్రంలో ఉంటాయి. ఈ చిత్రాన్ని దాదాపు 300 థియేట‌ర్ల‌లో రిలీజ్ చేస్తాను. అన్ని ప్ర‌ధాన థియేట‌ర్ల‌లో రిలీజ‌య్యేలా ప్ర‌య‌త్నం చేస్తున్నా. నేను శ్రీ‌కాంత్ అన్న‌కు పెద్ద ఫ్యాన్‌ని. అందుకే ఈ సినిమా రిలీజ్ చేస్తున్నా. మెంట‌ల్ ఈ సీజ‌న్‌కే సెన్సేష‌న‌ల్ హిట్ మూవీ అవుతుంది. నైజాం, ఏపీలో భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నాం`` అన్నారు.

హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ -``ఈ సినిమా మరో `ఆపరేషన్ దుర్యోధన` అవుతుంది. అందులో ఏమాత్రం సందేహం లేదు. ఇటీవ‌లే అవుట్ పుట్ చూస్తే చాలా బాగా వచ్చింది. ఈ సినిమా తప్పకుండా మంచి విజయం సాధిస్తుంది. అలాగే సాయి కార్తిక్ పెద్ద సినిమాలతో బిజీగా ఉన్నా మాకోసం ఈ సినిమాకి ప‌నిచేసి మంచి సంగీతాన్ని అందించాడు. దర్శక నిర్మాతలందరూ ఈ సినిమా కోసం చాల కష్టపడ్డారు. వారందరికీ ఈ సినిమా మంచి పేరు తీసుకొచ్చి మరిన్ని చిత్రాలు వ‌స్తాయి. ఏపీ, తెలంగాణ‌లో భారీ ఎత్తున ఈ చిత్రం రిలీజ‌వుతోంది. స‌మ‌ర్ప‌కుడు బ‌షీద్‌, నిర్మాత క‌రీమున్నీసా అంద‌రికీ పెద్ద హిట్ ద‌క్కాలి``అని అన్నారు.

ఈటీవీ ప్ర‌భాక‌ర్ మాట్లాడుతూ -``శ్రీ‌కాంత్ అన్న‌తో క‌లిసి ఇది నా రెండో సినిమా. ఇందులో ఓ ప‌వ‌ర్‌ఫుల్ కాప్ పాత్ర‌లో శ్రీ‌కాంత్ అద‌ర‌గొట్టేశారు. సినిమా మైండ్ బ్లోవింగ్‌. ఆప‌రేష‌న్ దుర్యోధ‌న‌, ఖ‌డ్గంని మించిన సినిమా అవుతుంది. మీ ఆశీస్సులు కావాలి`` అన్నారు.

ద‌ర్శ‌కుడు బాబ్జీ మాట్లాడుతూ-``ఆప‌రేష‌న్ దుర్యోధ‌న ఎమోష‌న్స్‌ని మించిన ఎమోష‌న్స్ ఈ చిత్రంలో ఉంటాయి. చాలా స‌న్నివేశాల్లో శ్రీ‌కాంత్ న‌ట‌న‌కు క్లాప్స్ ప‌డ‌తాయి. అవ‌కాశం ఇచ్చిన నా నిర్మాత‌ల‌కు థాంక్స్‌`` అన్నారు. 300 థియేట‌ర్ల‌లో రిలీజ్ చేస్తున్న బ‌షీద్ ఈ సినిమాతో పెద్ద విజ‌యం అందుకోవాల‌ని అతిధులు ఆకాంక్షించారు.

సుహాసిని, నిఖిత, రచన మౌర్య, ముమైత్ ఖాన్, పోసాని, కోట, బ్రహ్మానందం మొదలైన వారు నటించారు. ఈ చిత్రానికి సంగీతం : సాయి కార్తీక్, ఎడిటింగ్ : కోటగిరి, ఫైట్స్ : రవి, కెమెరా : బుజ్జి, నిర్మాతలు : వి.వి.ఎస్.ఎన్.వి ప్రసాద్ దాసరి, వి.వి. దుర్గాప్రసాద్ అనగాని, కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం : కారణం బాబ్జి

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.