close
Choose your channels

సంకాంత్రికి వస్తున్న సూర్య కొత్త చిత్రం

Monday, September 18, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

గ‌జినితో తెలుగు ప్రేక్ష‌కుల‌కు చేరువైన త‌మిళ క‌థానాయ‌కుడు సూర్య‌. ఇటీవ‌లే క‌థానాయ‌కుడిగా 20 సంవ‌త్స‌రాల‌ను పూర్తిచేసుకున్న సూర్య‌.. ప్ర‌స్తుతం విఘ్నేష్ శివ‌న్ ద‌ర్శ‌కత్వంలో త‌న 41వ చిత్రాన్ని చేస్తూ బిజీగా ఉన్నాడు. కీర్తి సురేష్ హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ చిత్రం తానే సేరంద్ర కూట్ట‌మ్ పేరుతో త‌మిళంలో తెర‌కెక్కుతుండ‌గా.. తెలుగు వెర్ష‌న్ కి ఇంకా టైటిల్ క‌న్‌ఫ‌ర్మ్ చేయ‌లేదు.

ఇదిలా ఉంటే.. తొలుత ఈ చిత్రాన్ని అక్టోబ‌ర్‌లో విడుద‌ల చేయాల‌ని చిత్ర యూనిట్ భావించింది. అయితే కొన్ని కార‌ణాల వ‌ల్ల సంక్రాంతికి వాయిదా వేసార‌ని తెలుస్తోంది. ఎస్‌ 3 త‌రువాత సూర్య క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న ఈ సినిమాపై త‌మిళ‌నాట మంచి అంచ‌నాలే ఉన్నాయి. సంక్రాంతికి తెలుగులో మూడు పెద్ద హీరోల సినిమాలు బ‌రిలో ఉన్నాయి కాబ‌ట్టి సూర్య చిత్రం కాస్త ఆల‌స్యంగా విడుద‌ల‌య్యే అవ‌కాశ‌ముంద‌ని స‌మాచారం.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.