close
Choose your channels

త్రిష , నయనతార కలిసి నటిస్తున్నారా?

Wednesday, November 4, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

తమిళ చిత్రసీమను తమ గ్లామర్ తో ఆకట్టుకున్న ముద్దుగుమ్మలు నయనతార, త్రిషలు ఒకప్పుడు శత్రువుల్లా కీచులాడుకున్నారు. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. అయితే సినిమా రంగంలో ఎవరూ శాశ్వత మిత్రులుండరు. అదేవిధంగా శాశ్వత శత్రువులుండరు. ఇదే విషయాన్ని వీరిద్దరూ మరోసారి రుజువు చేశారు. ప్రస్తుతం నయనతార, త్రిషలు మంచి స్నేహితులయ్యారు. రీసెంట్ గా నయనతార, విజయ్ సేతుపతి నటించిన నానుం రౌడీ దాన్` చిత్రం మంచి సక్సెస్ అందుకుంది.

ఈ చిత్రానికి నయనతార కొత్త ప్రేమికుడు విఘ్నేష్ శివ డైరెక్టర్. ఇప్పుడు మరోసారి తన లవర్ దర్శకత్వంలోనే నయనతార మరోసారి విజయ్ సేతుపతితో కలిసి నటించడానికి రెడీ అవుతోందట. ఈ చిత్రంలో మరో హీరోయిన్ పాత్రలో త్రిషను చేయమని యూనిట్ సంప్రదిస్తే త్రిష కూడా పాజిటివ్ గానే రెస్పాండ్ అయ్యిందట. మొత్తం మీద అన్నీ అనుకున్నట్టు కుదిరితే నయనతార, త్రిష ఓకే సినిమాలో అభిమానులను అలరించబోతున్నారన్నమాట.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.