close
Choose your channels

టీడీపి-కాంగ్రెస్ పొత్తు ఎన్టీఆర్ బయోపిక్ కి దెబ్బ కానుందా...

Monday, November 5, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

టీడీపి-కాంగ్రెస్ పొత్తు ఎన్టీఆర్ బయోపిక్ కి దెబ్బ కానుందా...

నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న తాజా చిత్రం 'యన్ టి ఆర్'. నందమూరి బాలకృష్ణ ఈ చిత్రమో టైటిల్ పాత్ర పోషిస్తున్నారు. క్రేజీ దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా 'కథానాయకుడు', 'మహానాయకుడు' విడుదల కానున్న విషయం తెలిసిందే.

ఇప్పటికే చిత్ర యూనిట్ ఈ రెండు చిత్రాల విడుదల తేదీల ను కూడా ఖరారు చేసింది. మొదటి భాగం "కథానాయకుడు"లో ఎన్టీఆర్ సినీ జీవితాన్ని, రెండొవ భాగం "మహానాయకుడు"లో ఎన్టీఆర్ రాజకీయ జీవితాన్ని చేపెట్టనున్నారు. అయితే ఎన్టీఆర్ సినిమా జీవితంలో ఎటువంటి ఆటుపోటులను లోనవ్వకుండా అంచలంచలుగా స్టార్ హీరోగా ఎన్టీఆర్ ఎదిగిన తీరు అందరికి తెలిసిందే. సినీ జీవితంలాగా ఎన్టీఆర్ రాజకీయ జీవితం అంత సాఫీగా ఏం సాగలేదు.

ఎన్నో ఆటు పోట్లు ట్విస్టులతో కూడిన విషయం అందరికి తెలిసిందే.అలాగే ఎన్టీఆర్ టిడిపి పార్టీని స్థాపన, కాంగ్రెస్ పై తిరుగుబాటు చేసిన అంశాలు రెండో భాగానికి చాలా హైలెట్ గా నిలవనున్నాయని భావించారంతా కానీ ఇప్పుడు తాజా రాజకీయ పరిణామాల వల్ల 'యన్ టి ఆర్' సినిమాలో ఆ ఎగ్సయిట్ మెంట్ మిస్ అవుతుందో ఏమోనన్న అనుమానాలు వస్తున్నాయి.

అయితే తెలుగు రాష్ట్రాల్లో టిడిపి - కాంగ్రెస్ పొత్తు వల్ల 'యన్ టి ఆర్' బయోపిక్ కు దెబ్బ కానుందా అనే ఊహాగానాలు ఇండస్ట్రీలో వినపడుతున్నాయి. ఎందుకంటే ఎన్టీఆర్ కాంగ్రెస్ పై తిరుగుబాటుతోనే తెలుగు దేశం పార్టీ పునాదిగా ఏర్పడిందంటే ఏ రేంజ్ లో ఎన్టీఆర్ కాంగ్రెస్ ని వ్యతిరేకించారో అర్ధమవుతుంది. తెలుగు వాళ్లమనే నేటివిటీని లేవనెత్తి పార్టీ స్థాపించిన ఆనతి కాలంలో కాంగ్రెస్ పై గెలిచి ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తీరు దేశంలోనే అప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. అలాంటిది ఇప్పుడు చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ తో పొత్తుపెట్టుకోవడంతో సినిమాలోని ఈ కీలక సన్నివేశాలను మార్చుతున్నారని, సినిమా విడుదల తేదీల్లో కూడా మార్పులు ఉండవొచ్చని వార్తలు వస్తున్నాయి.

అయితే ఇవన్నీ కేవలం ఊహాగానాలేనని బాలయ్య సన్నిహితులు కొట్టిపారేస్తున్నారు.సినిమా మొదలుకు ముందు ఏ స్క్రిప్ట్ అయితే ఫైనల్ చేశారో అందులో ఒక్క సీన్ కూడా మార్పు చేయలేదని వారు అంటున్నారు. అలాగే 'యన్ టి ఆర్ ' రెండు భాగాలు చిత్ర యూనిట్ ప్రకటించిన తేదీలకే విడుదల అవుతాయని చెబుతున్నారు. ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్న 'యన్ టి ఆర్ ' కథానాయకుడు" మొదటి భాగం సంక్రాంతి కానుకగా జనవరి 9న, రెండొవ భాగం 'యన్ టి ఆర్ మహానాయకుడు' అదే నెల జనవరి 24 న విడుదల కానున్నాయి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.