close
Choose your channels

12th Fail:తెలుగులోనూ '12th ఫెయిల్' స్ట్రీమింగ్.. ఏ ఓటీటీలో అంటే..?

Tuesday, March 5, 2024 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఇటీవల హిందీలో విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న చిత్రం '12th ఫెయిల్'. ప్రముఖ IPS ఆఫీసర్ మనోజ్ కుమార్ శర్మ జీవిత కథ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. విధు వినోద్ చోప్రా డైరెక్ట్ చేసిన ఈ మూవీలో మనోజ్ కుమార్ శర్మ పాత్రని విక్రాంత్ మాస్సే పోషించగా.. మనోజ్ సతీమణి, ఐఆర్‌ఎస్ ఆఫీసర్ శ్రద్ధ జోషి పాత్రలో మేధ శంకర్ నటించారు. విడుదలకు ముందు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపింది. కేవలం రూ.20కోట్లతో తెరకెక్కిన ఈ మూవీ రూ.70కోట్లు రాబట్టి రికార్డు సృష్టించింది. అనంతరం ఓటీటీలో విడుదలై అక్కడ కూడా ప్రేక్షుకుల ఆదరణ పొందింది.

దీంతో ఈ సినిమా టాక్ ఆఫ్ ది సోషల్ మీడియా అయిపోయింది. నెటిజన్లు అంతా ఈ సినిమాను మెచ్చుకుంటూ పోస్టులు పెట్టారు. అలాగే సెలబ్రెటీలు కూడా మూవీపై ప్రశంసలు కురిపించారు. విమర్శకులు సినిమాపై ప్రశంసల జల్లు కురిపించారు. ఇలాంటి సినిమా కేవలం హిందీ భాషలో మాత్రమే అందుబాటులో ఉండటంతో దక్షిణాది అభిమానులు కాస్త నిరుత్సాహం చెందారు. తమ భాషల్లో చూసేందుకు ఇంట్రెస్ట్ చూపారు. దీనిపై మూవీ యూనిట్‌ను ట్యాగ్ చేస్తూ పోస్టులు పెట్టారు. ఎట్టకేలకు వారి ఎదురుచూపులకు తెరపడింది.

ఈ సినిమా డిస్నీ హాట్‌స్టార్ వేదికగతా నేటి నుంచి తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ నేపథ్యంలో అభిమానులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. మరి సౌత్ ఇండియన్ భాషల్లో ఎలాంటి రికార్డులు నమోదుచేస్తుందో చూడాలి. జీస్టూడియోస్ నిర్మించిన ఈ మూవీలో ప్రియాంషు ఛటర్జీ, సంజయ్ బిష్ణోయ్, హరీష్ ఖన్నా వంచి నటులు కీలక పాత్రలు పోషించారు. శంతను మోయిత్రా ఆకట్టుకునే సంగీతాన్ని అందించారు.

బిహార్‌లోని ఓ గ్రామంలో నిజాయితీపరుడైన క్లర్క్ కొడుకు మనోజ్ కుమార్ 12th ఫెయిల్ అవుతాడు. అయినప్పటికీ ఎప్పటికైనా ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలనే కలతో ఢిల్లీలో పార్ట్ టైమ్ జాబులు చేస్తూ కష్టపడి ప్రిపేర్ అవుతాడు. స్వయంకృషితో, సొంత కోచింగ్‌తో మనోజ్ కుమార్ తన కలను నిజం చేసుకుంటాడు. అయితే ఆ ప్రయాణంలో అతను పడిన కష్టాలు, బాధలు, విజయాలు ఇలా ప్రతీ దాన్ని చాలా అద్భుతంగా తెరకెక్కించారు. ముఖ్యంగా యూపీఎస్సీ సహా పలు పోటీ పరీక్షలకి ప్రిపేర్ అయ్యే యువతకు ఈ సినిమాకు ఫిదా అయిపోయారు. కాగా ఇటీవల బాలీవుడ్‌లో ప్రకటించిన ఫిలింఫేర్ అవార్డుల్లో ఈ సినిమా ఐదు అవార్డులను సొంతం చేసుకొని శభాష్ అనిపించింది. బెస్ట్ మూవీ, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ యాక్టర్ క్రిటిక్స్, బెస్ట్ స్క్రీన్ ప్లే, బెస్ట్ ఎడిటింగ్ విభాగాల్లో పురస్కారాలు అందుకుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.