close
Choose your channels

2.0 ఆడియో వేడుక - ఎలా చేస్తున్నారో తెలిస్తే షాక్

Wednesday, October 25, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

రజనీకాంత్-అక్షయ్‌కుమార్‌-శంకర్ కాంబినేషన్ లో లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటున్న చిత్రం 2.0. ఎమీజాక్సన్‌ హీరోయిన్ గా నటిస్తోంది. ఆస్కార్‌ విజేత ఏఆర్‌ రెహ్మాన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. ఈ చిత్రానికి సంబందించిన ఆడియో ని ఈ నెల 27న దుబాయ్‌లో భారీ ఎత్తున రిలీజ్ చేయనున్నారు.

ప్రపంచ ప్రసిద్ధ 7 స్టార్‌ హోటల్‌ బుర్జ్‌ దుబాయ్‌లో ఈ చిత్రం ఆడియో ని చాలా గ్రాండ్‌గా నిర్వహించేందుకు లైకా ప్రొడక్షన్స్ సంస్థ భారీ ఏర్పాట్లు చేస్తోంది. అయితే ఈ ఆడియో వేడుకకు సంబందించిన హైలెట్స్‌ను చిత్ర బృందం విడుదల చేసింది.

  • వేడుకకు ముఖ్య అతిథిగా దుబాయ్‌ రాజు
  • 2.0` చిత్రంలోని ఒక పాటకి రెహ్మాన్‌ లైవ్‌ కంపోజింగ్‌.
  • 125 సింఫొనీ కళాకారులతో కలిసి ఏఆర్‌ రెహ్మాన్‌ సంగీత విభావరి.
  • బాస్కో డ్యాన్స్‌ బృందం ఆటపాటా...
  • బుర్జ్‌ దుబాయ్‌ పార్కు హోటల్‌లో సినిమా ఆడియో వేడుకకు దుబాయ్‌ ప్రభుత్వం అనుమతివ్వడం ఇదే తొలిసారి.
  • 12వేల మంది ఈ వేడుకను ఉచితంగా తిలకించవచ్చట.
  • దుబాయ్‌లోని పెద్ద పెద్ద మాల్స్‌లో భారీ ఎల్‌ఈడీ స్ర్కీన్లు ఏర్పాటుచేసి, ఆడియో వేడుక ప్రత్యక్ష ప్రసారం.
  • ఆడియో ముందు రోజు జరిగే ప్రెస్ మీట్ కు అంతర్జాతీయ మీడియా హాజరు కానుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.