close
Choose your channels

చైనాలో '2.0' భారీ రిలీజ్‌

Wednesday, December 5, 2018 • తెలుగు Comments
2.0
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

చైనాలో 2.0 భారీ రిలీజ్‌

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ క‌థానాయ‌కుడిగా `రోబో` సీక్వెల్ `2.0`న‌వంబ‌ర్ 29న విడుద‌లైంది. ఈ సినిమా మిక్స్‌డ్ టాక్‌తో స‌క్సెస్‌ఫుల్‌గా ర‌న్ అవుతోంది. ఈ సంద‌ర్భంలో ఈ సినిమాను హెచ్‌వై మీడియా అనే అతి పెద్ద డిస్ట్రిబ్యూష‌న్ కంపెనీ స‌హ‌కారంతో లైకా ప్రొడ‌క్ష‌న్స్ సినిమాను చైనాలో విడుద‌ల చేస్తుంది

ఈ సినిమా చైనాలో 10000 థియేట‌ర్స్‌లో 56000 స్క్రీన్స్‌లో విడుద‌ల కానుండ‌టం విశేషం. అందులో 47000 స్క్రీన్స్‌లో సినిమా త్రీడీలో విడుద‌ల కానుంది. చైనీస్ భాష‌లో సినిమాను డ‌బ్ చేసి.. ఇంగ్లీష్ స‌బ్ టైటిల్స్‌తో సినిమాను విడుద‌ల చేయ‌బోతున్నారు.

అయితే ఏ రోజున రిలీజ్ చేయ‌నున్నార‌నే దానిపై క్లారిటీ ఇవ్వ‌లేదు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.